Bandla Ganesh : బానిసత్వానికి హద్దంటూ ఉంటుంది అంటూ… ఒక గాడిద ఫోటోను ట్వీట్ చేసిన బండ్లన్న…

Bandla Ganesh : బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ లో నిర్మాతగా, నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. తనదైన హావభావాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. బండ్ల గణేష్ యాక్టర్ గానే కాకుండా బిజినెస్ మేన్ గా కూడా సత్తా చాటుతున్నారు. అలా తనకంటూ స్పెషల్ ఫ్యాన్స్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. బండ్ల గణేష్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం, సామాజిక మాధ్యమాల్లో చురుకుగా వ్యవహరిస్తుండడం ఆయన నైజం. నిత్యం బండ్లన్న పెట్టే ట్వీట్స్ వైరల్ అవుతుంటాయి. ట్విట్టర్లో తనదైన కోణంలో పోస్టులు పెడుతూ, నెటిజన్లలను టచ్ చేస్తుండడం పనిగా పెట్టుకున్న బండ్ల గణేష్ . తాజాగా ఓ ట్వీట్ చేసి దుమారం రేపారు.

‘ బానిసత్వానికి ఒక హద్దు ఉంటుంది.. మనిషికైనా, జంతుకైనా ‘ అంటూ ఓ ఫోటో వీడియో పోస్ట్ చేశారు బండ్ల గణేష్ ఇందులో ఓ గాడిద కనిపిస్తోంది. దీంతో ఈ ట్వీట్ పై నెటిజన్లు భిన్న వాదనలు వినిపిస్తుండడంతో తెరపైకి పవన్ కళ్యాణ్ ఇష్యూ వచ్చింది. బండ్లన్న ట్రీట్ అంటే కామెంట్ల మోత మోగడం సాధారణమైన ఈ మధ్యకాలంలో ఆయన చేస్తున్న ట్వీట్స్ పలు అనుమానాలకు దారితీస్తున్నాయి. పరోక్షంగా పవన్ కళ్యాణ్ పై ఏమన్నా కామెంట్స్ చేస్తున్నారా అనే డౌట్స్ కొందరిలో వస్తున్నాయి. ఇందుకు కారణం రీసెంట్ గా ఆయన హాలులో ఉన్న పవన్ ఫోటో తీసేయడమే. ఈ క్రమంలోనే తాజాగా వదిలిన గాడిద ఫోటో చూసి ఈ పోస్ట్ పై ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఆలోచిస్తున్నారు.

Bandla Ganesh : బానిసత్వానికి హద్దంటూ ఉంటుంది అంటూ

Bandla Ganesh shocking comments on social media
Bandla Ganesh shocking comments on social media

దీన్ని పాలిటిక్స్ తో లింక్ చేస్తూ బండ్లను దేవుడు పవన్ కళ్యాణ్ పై ఇన్ డైరెక్ట్ గా సెటైరికల్ కామెంట్లు వదులుతున్నారు కొందరు యాంటీ ఫ్యాన్స్.ఈ ట్వీట్ చూసిన కొందరు మెగా ఫ్యామిలీకి బానిసత్వం ఆపేస్తున్నావా ఏంటి అని సందేహిస్తున్నారు. అలాగే ఆంధ్రాలో మీ దేవర బానిసత్వానికి హద్దు అదుపు ఏం లేవు అనేది మరొకరి కామెంట్. ఇలా మొత్తానికి బండ్లన్న ట్రీట్ అయితే పలు అనుమానాలకు తెరలేపింది. బండ్ల గణేష్ నటుడిగా, నిర్మాతగా కాకుండానే రీసెంట్ గా హీరో అవతారం ఎత్తారు. ‘ డేగల బాబ్జి ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఆశించిన ఫలితం రాలేదు. అయినా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు కొత్త పోస్టులను పెట్టి పాపులర్ అవుతుంటారు.