Anushka : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుందట. దీనికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో అనుష్క అభిమానులు సంతోషంతో కామెంట్లు పెడుతూ హోరెత్తిస్తున్నారు. సూపర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అనుష్క అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకుంది. అనుష్క ఏ పాత్రనైనా ఈజీగా చేయగలదు. బాహుబలి లో ఆమె నటనకు అందరు ఫిదా అయిపోయారు.
అనుష్క సినిమాల పరంగా ఎలా ఉన్నా వ్యక్తిగతంగా పెళ్లి విషయంలో సోషల్ మీడియాలో ఎప్పుడు ట్రోల్ అవుతూనే ఉంటుంది. అయితే అనుష్కకి స్టార్ హీరో ప్రభాస్ కి వీరిద్దరి మధ్య లవ్ ఎఫైర్ ఉందని గత కొన్ని సంవత్సరాలుగా ఈ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే వీటిపై ఎప్పటికప్పుడు ప్రభాస్ అనుష్క మేము ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చారు. అయినా ఈ వార్తలు మాత్రం ఆగట్లేదు. అయితే అలాంటి వార్తలకు త్వరలోనే అనుష్క బ్రేక్ వేయబోతుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. త్వరలోనే అనుష్క పెళ్లి పీటలు ఎక్కబోతుందని తెలుస్తుంది.
Anushka : బంగారం లాంటి మొగుడిని కొంగున కట్టుకోబోతున్న అనుష్క…

దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మరికొద్ది రోజుల్లోనే రానుందని సినీవర్గాలు చెబుతున్నాయి. తాజాగా ఈ అమ్మడు పెళ్లి గురించి ఓ ఆసక్తికర న్యూస్ బయటకు వచ్చింది. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తను అనుష్క పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. అంతేకాదు అతడు బంగారం వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం. సిటీలో అతనికి దాదాపుగా 25 కు పైగా బ్రాంచ్ లు ఉన్నట్లు సోషల్ మీడియాలో టాక్. ఇది పెద్దలు కుదిర్చిన వివాహమే అంటున్నారు సినీ వర్గాలు. త్వరలోనే వీళ్ళిద్దరూ అధికారికంగా ఫ్రెండ్స్ కి చెబుతామని చెప్పారట. దీంతో అనుష్క ఫ్రెండ్లలలో ఒకరైన అమ్మాయి ఈ వార్తను వైరల్ చేస్తుంది.