Guppedantha Manasu 17 October 2022 Episode : చిన్నితెరపై ప్రసారమయ్యే సీరియల్ గుప్పెడంత మనసు. ఈ సీరియల్ ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 583 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… మహేంద్ర జగతి రిషి వసుధారాల గురించి బాధపడుతూ ఉంటారు. మహేంద్ర జగతిని నువ్వు సుధారాని అలా కొట్టడం ఏం బాగాలేదు అని అంటూ ఉంటాడు అప్పుడు జగతి నేను తననీ కొట్టినందుకు బాధపడటం లేదు మహేంద్ర రిషి మనసు ఎంత బాధ పడిందో అని బాధపడుతున్నాను తనని ఎందుకు వసుధారా అలా బాధ పెడుతుంది తన సున్నితమైన మనసుని గాయం చేస్తుంది అంటూ జగతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు మహేంద్ర కూడా రిషి ఫోటోని చూస్తూ దీనికి కారణం నేనే అనుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే వసుధార రిషి ఒక దగ్గర కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. రిషి నేను ఇచ్చిన చీర ఎందుకు కట్టుకోలేదు అని వసుని అడుగుతూ ఉంటాడు. అప్పుడు వసుధార ఆరు గజాల చీర దేముంది సార్ మనిద్దరి మధ్య బంధం ఆ చీర కట్టుకుంటే నిలబడుతుందా.. అది కట్టుకోకపోతే తెగిపోతుందా…
అని కొన్ని కొటేషన్స్ ను రిషికి చెప్తూ ఉంటుంది. నీకు ఇంత జరిగినా ఏం బాధ లేదా వసుధార అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు వసుధార ఇందులో బాధపడాల్సిన విషయం ఏముంది సార్. ఒక చెంప దెబ్బ ఒక చీర ఇంక కొత్తవి ఏమీ లేవు కదా అదే నేను అదే మీరు మనిద్దరి మధ్య ప్రేమ ఏమైనా తగ్గుతుందా ఆకాశమంత ప్రేమ ముందు ఆరు గజాల చీర దేముంది అని అంటూ ఉంటుంది. అప్పుడు రిషి నీకు జగతి మేడం కొట్టినందుకు బాధ లేదా అని అడుగుతూ ఉంటాడు అప్పుడు వసుధార నేను మీకు ఇంతకుముందే చెప్పాను జగతి మేడం నన్ను కొట్టి అధికారం ఉంది నేను అస్సలు దాని గురించి బాధపడటం లేదు అని అంటుంది. అప్పుడు రిషి నేను జగతి మేడం తరఫున సారీ చెప్తున్నాను అని అంటాడు అప్పుడు వసుధర మీరు జగతి మేడం తరఫున సారీ చెప్పడం అంటే తనకి మీకు బంధం ఉన్నట్లే కదా అని అంటుండగా రిషి తనపై మండిపడుతూ ఇక ఈ విషయాన్ని ఇంతటితో మర్చిపో అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు వసుధర మీరు కచ్చితంగా మారుతారు అని అనుకుంటూ తను కూడా అక్కడినుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే దేవయాని వసు గురించి మాట్లాడుకుంటూ..
Guppedantha Manasu 17 October 2022 Episode : వసుధారని ఈరోజు మొత్తం నీ దగ్గరే ఉంటా అంటున్న రిషి…
ధరణిని టీ చాలా బాగా పెట్టావు ఆ చీర నీకు చాలా బాగుంది అని తనని ప్రేమగా మాట్లాడుతూ పొగుడుతూ ఉంటుంది. అప్పుడు ధరణి ఆశ్చర్యపోతూ ఇంత కూల్ గా మాట్లాడుతుందంటే ఏదో తుఫాన్ రాబోతుంది అని అనుకుంటూ ఉంటుంది మనసులో. ఇక చివరిలో దేవయాని మహేంద్ర జగతి గౌతం వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఒక కన్నేసి ఉంచు నాకు జరిగిందంతా చెప్పు వెళ్ళు అని ధరణిని అక్కడికి పంపిస్తూ ఉంటుంది. అప్పుడు ధరణి అక్కడికి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే రిషి వసుధారని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. వసు వెళ్ళిపోతూ ఉంటుంది.
అప్పుడు రిషి కనీసం బాయ్ కూడా చెప్పరా అని అడుగుతూ ఉంటాడు అప్పుడు వసుధార మళ్లీ తిరిగి వచ్చి కారుకి తీసుకొని వెళుతూ ఉంటుంది. అప్పుడు రిషి ఏం చేస్తున్నావు వసుధారా అని అడగగా.. అప్పుడు వసుదార ఇలా చేశాను అంటే దాని అర్థం మీరు కూడా లోపలికి రండి అని అంటుంది. అప్పుడు రిషి దేవయానికి ఫోన్ చేసి నేను ఈరోజు రావడం లేదు ఇంటికి అని చెప్తాడు. తర్వాత రిషి రూమ్ లోపలికి వెళ్లి అంతా చూస్తూ వసుధర నీ రూమ్ లోకి అడుగుపెట్టగానే ఏదో మంచి ఫీలింగ్ కలుగుతుంది నాకు అని చెప్తూ ఉంటాడు అప్పుడు వసుధార అది ప్రేమంటే అని అంటూ ఉంటుంది.
అప్పుడు రిషి వసుధార చేతుల్ని పట్టుకుని నీ జీవితంలో కొన్ని ఇంపార్టెన్స్ విషయాలు ఉంటాయి కదా దాంట్లో జగతి మేడం ఎక్కువ నేను ఎక్కువ నీకు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు వసుధార ఆలోచించి జగతి మేడమే ఎక్కువ సార్ అని అంటుంది అప్పుడు ఋషి తన చేతుల్ని వదిలేసి మరి నేనేంటి వసుదరా అని అడగగా… మీరు నా జీవితం నేను మీరు వేరు కాదు అని తనపై ప్రేమ చూపిస్తూ ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక తర్వాతే ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే…