Jabardasth Getup Srinu : ఈ మధ్య జబర్దస్త్ షో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. జబర్దస్త షోలోని కామెడీ కంటే కూడా జబర్దస్త్ లోని కమెడియన్లు చేసే కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇటీవల కిరాక్ ఆర్పీ.. జబర్దస్త్ మీద.. మల్లెమాల సంస్థ మీద పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అక్కడ ఆర్టిస్టులను వాళ్ల బానిసలుగా చూస్తారంటూ షాకింగ్ కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో జబర్దస్త్ మాజీ మేనేజర్ ఏడుకొండలు ఓ ఇంటర్వ్యూలో జబర్దస్త్ ఆర్టిస్టులపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. కిరాక్ ఆర్పీపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డాడు. జబర్దస్త్ ను వదిలేసి వేరే చానల్ లో షోలు చేస్తున్న సుడిగాలి సుధీర్, గెటప్ శీనుపై కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశాడు. వీళ్లు ఖచ్చితంగా తిరిగి జబర్దస్త్ కు రావాల్సిందేనని.. లేదంటే వీళ్ల బండారం మొత్తం బయటపెడతా అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
Jabardasth Getup Srinu : గెటప్ శీనుకు నేను కారు ఇచ్చా..
గెటప్ శీను గురించి చాలా విషయాలు చెప్పాడు ఏడుకొండలు. జబర్దస్త్ లో పని చేస్తున్న సమయంలో తన రెమ్యునరేషన్ పెంచాలంటూ రోజూ గెటప్ శీను గొడవ చేసేవాడని.. కారు కొనుక్కోవాలని అడిగాడని.. దీంతో తన కారే ఇచ్చేశానని ఏడుకొండలు చెప్పుకొచ్చాడు.
ఈ వ్యాఖ్యలపై గెటప్ శీను కూడా స్పందించాడు. నేను అమ్మాను అని చెప్పడానికి.. ఇచ్చేశాను అని చెప్పడానికి చాలా వ్యత్యాసం ఉంది. కెమెరా ఉంటే చాలా.. స్పృహ లేకపోతే ఎలా అంటూ కొండలు ఉన్న ఓ ఎమోజీని సోషల్ మీడియాలో గెటప్ శీను షేర్ చేశాడు.
దీంతో ఇది ఏడుకొండలుకు ఇచ్చే కౌంటర్ అని అందరికీ అర్థం అయిపోయింది. నేను చేసిన బిల్డప్ బాబాయి క్యారెక్టర్ కు ఇతడే స్ఫూర్తి అంటూ ఏకంగా ఏడుకొండలు ఫోటోనే పెట్టి గెటప్ శీను డైరెక్ట్ ఎటాక్ చేశాడు. అంతా బిల్డప్ బాబాయి అంటూ గాలి తీశాడు గెటప్ శీను.
మొత్తానికి జబర్దస్త్ వివాదం రోజురోజుకూ ముదురుతోంది. సోషల్ మీడియాలో కూడా దీని గురించే చర్చ. దీనిపై జబర్దస్త్ పెద్దలు ఏమైనా స్పందిస్తారేమో వేచి చూడాల్సిందే.