Kajal Agarwal : టాలీవుడ్ లో కాజల్ అగర్వాల్, సమంత స్టార్ హీరోయిన్స్ గా పేరు తెచ్చుకున్నారు. కాజల్ ‘ లక్ష్మీ కళ్యాణం ‘ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. రెండో సినిమా మగధీరతో బ్లాక్ బస్టర్ హిట్టును అందుకుంది. ఇక ఆ తర్వాత వరుస సినిమాలను చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. సమంత కూడా ‘ ఏ మాయ చేసావే ‘ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత వరుస హిట్ ఫ్లాప్ సినిమాలని చేస్తూ టాప్ హీరోయిన్గా నిలిచింది. ప్రస్తుతం సమంత పాన్ ఇండియా సినిమాలను చేస్తూ ఓ రేంజ్ లో ఉంది.
అయితే సినిమాల పరంగా కాజల్ సమంత టాప్ పొజిషన్లో ఉన్న వ్యక్తిగతంగా సమంతా కంటే కాజల్ దే పై చెయ్యి. కాజల్ ఆలస్యంగా పెళ్లి చేసుకున్న అమ్మ అని పిలుపుకు దగ్గర అయింది. సమంత ఎంతో హంగామా తో పెళ్లి చేసుకున్న అమ్మ అనే పిలుపుకు దూరమైంది. అయితే తాజాగా సినీ సమాచారం ప్రకారం కాజల్ సమంత చేసిన తప్పుని చేయబోతుందని అంటున్నారు. మనకు తెలిసిందే సమంత పెళ్లి తర్వాత చాలా పద్ధతి పాత్రలను చేస్తూ వచ్చింది. కానీ ఇటీవల హిందీలో ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో బోల్డ్ క్యారెక్టర్ లో నటించింది.
Kajal Agarwal : సమంతా రూటులో వెళుతున్న కాజల్…
అయితే ఇప్పుడు అలాంటి పాత్రలోనే కాజల్ నటించబోతున్నట్లు తెలుస్తుంది. కాజల్ ఇప్పటికే రెండు భారీ సినిమాలను సైన్ చేసి తన రిఎంట్రిని బిగ్గెస్ట్ హిట్ గా మలుచుకోవడానికి రెడీ అయింది. అయితే ఇదే తరహాలో వెబ్ సిరీస్ లో నటించేందుకు కాజల్ ఓకే చెప్పిందట. ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లాగా ఉండే ఈ కంటెంట్ లో కాజల్ బోల్డ్ పాత్రలో నటించబోతుందట. ఒకవేళ ఇదే కనుక నిజమైతే సమంత లాగే కాజల్ కూడా విడాకులు తీసుకోవాల్సి వస్తుంది అంటున్నారు. అయితే కాజల్ ఫ్యాన్స్ మాత్రం సమంత లా కాజల్ చేయదు అని చెప్పుకొస్తున్నారు. మరి ఏం జరుగుతుందో కొద్ది రోజులు వేచి చూడాలి.