Nayanathara : చలనచిత్ర పరిశ్రమలో సినిమా కుల విషయంలో కొన్ని పద్ధతులు ఉంటాయి. ఎంత పాపులారిటీ ఉన్న హీరో లేదా హీరోయిన్ అయినప్పటికీ ఆ పద్ధతిలో పాటించవలసిందే. సినిమా ఇండస్ట్రీలో ఎంత పాపులర్ ఉన్న స్టార్ కొడుకు అయినప్పటికీ ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినప్పటికీ ఇండస్ట్రీ రూల్స్ కచ్చితంగా పాటించి తీరాల్సిందే. కానీ ఈ రూల్స్ తనకేం పట్టవంటూ సినిమా ఇండస్ట్రీని ఏలేస్తున్న ఒకే ఒక్కరు నయనతార. కాగా ఈ విషయాన్ని హైలెట్ చేస్తున్నారు కొందరు నెటిజెన్స్. కోలీవుడ్ లేడీస్ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్నటువంటి నయనతార ప్రస్తుతం విగ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకొని లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. ఈ మధ్యనే లవ్ మ్యారేజ్ చేసుకున్న నయనతార విదేశాలలో తన హనీమూన్ ని ఎంజాయ్ చేసింది.
ప్రజెంట్ సినిమాలలో చాలా బిజీగా ఉన్న నయనతార గోపక్క తన భర్తతో విదేశాలలో టూర్లు వేస్తూ లైఫ్ ని చాలా జాలీగా గడిపేస్తోంది. ఇది ఇలా ఉండగా ఇండస్ట్రీలో సినీ పెద్దలకు దర్శక నిర్మాతలకు జీర్ణించిన విషయం ఒకటి ఉంది. నయనతార ఏ సినిమాలో నటించిన ఆ సినిమాలో ప్రమోషన్లకి రాకపోవడం. ఈ విషయంలోనే తెలుగు అగ్ర హీరోలైనటువంటి చిరంజీవి మరియు నాగార్జున వంటి వారికి కూడా చుక్కలు చూపించింది ఈ ముద్దుగుమ్మ. కాగా ఈ విషయం ప్రస్తుతం వైరలై సోషల్ మీడియా ద్వారా నెట్టింట చెక్కర్లు కొడుతుంది. సూపర్ స్టార్లతో కలిసి నటించిన కానీ ప్రమోషన్స్ కి రమ్మంటే నయనతార మాత్రం నానా హంగామా చేస్తుంది అంటూ దర్శక నిర్మాతలకు చుక్కలు చూపిస్తుందంటూ అప్పుడు వార్తలు వైరల్ అయ్యాయి.
ఇంతలా తన ప్రమోషన్లకు రానప్పటికీ నయనతారని ఎందుకు సినిమాలలో అవకాశాలు ఇస్తున్నారని తమ సినిమాలలో ఎందుకు పెట్టుకుంటున్నారని ప్రశ్నిస్తే దానికున్న ఒకే ఒక్క సమాధానం సినిమా ఇండస్ట్రీలో ఆమెకున్న క్రేజ్. ఇంకా చెప్పాలంటే ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా ఆమె సహజమైన నటన అని తెలుస్తుంది. ఇందువల్లనే ఈమెకి ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ వెతుక్కుంటూ వెళ్లి అవకాశాలు ఇస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో నేను ప్రమోషన్స్ కి వచ్చేదే లేదు అన్నా కానీ వారు నోరు మూసుకొని ఉంటున్నారు. కానీ ప్రమోషన్ కి రమ్మంటూ ఏనాడు తనను బలవంతం చేయలేదు అని వార్తలు వస్తున్నాయి.