Nayanatara : ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్లలో ఒకరు నయనతార. ఈ అమ్మడు స్పెషల్ పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఈ భామ ఈమధ్య కాలంలో తన వివాహంతో తన రేంజ్ ను పెంచుకుంది. మామూలుగా పలు హీరోయిన్స్ వివాహం తర్వాత అసలు మూవీలలో చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించరు. కానీ ఈ ఆగ్ర హీరోయిన్ మాత్రం ఎప్పటిలాగానే తన ఇమేజ్ ను ఒక రేంజ్ కి పెంచుకోబోతుంది. అదేవిధంగా రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచడం అనేది ఒక విశేషం. ఇప్పుడు ఈ అమ్మడు కమర్షియల్ మూవీ లకు హీరోయిన్ రోల్ కోసం ప్రధానంగా నాలుగు నుంచి ఐదు కోట్ల వరకు డిమాండ్ చేస్తుందట. టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవితో గాడ్ ఫాదర్ అనే మూవీలో చేస్తున్న విషయం తెలిసింది.
అదేవిధంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఈమెకు గట్టిగానే ఆఫర్లు వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో అట్లీ షారుక్ మూవీ లో కూడా ఈ అమ్మడు హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు సమాచారం ఇచ్చారు. జవాన్ అనే మూవీకు కూడా ఈ బ్యూటీ దానికంటే ఎక్కువే రమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి.అలాగే తొందర్లో స్టార్ట్ అవ్వబోయే ఒక లేడీ ఓరియంటల్ ప్రాజెక్టు కొరకు కూడా ఈ అమ్మడు సుమారు 10 కోట్ల వరకు పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. జి స్టూడియో సంస్థలు తెరకెక్కబోయే త్రిల్లర్ మూవీకు శంకర్ శిష్యుడు నీలేష్ కృష్ణ దర్శకత్వంలో చేయబోతున్నారు.
Nayanatara : నయనతార పారితోషికం… ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది…

అందుకే ఆ ప్రాజెక్టులో చేసేందుకు ఈ అగ్ర హీరోయిన్ సుమారు 10 కోట్లు పారితోషకంని తీసుకుంటుందట.ఇప్పుడు దీపిక పదుకొనే ఆలియా భట్ లాంటి అగ్ర హీరోయిన్స్ ఎనిమిది నుంచి తొమ్మిది కోట్ల వరకు పారితోషకం అడుగుతున్నారట. అందుకే నయనతార కూడా ఈ విధంగా తీసుకోవడం అందర్నీ షాక్ గురి చేస్తుంది. ఫస్ట్ టైం ఒక కోలీ వుడ్ హీరోయిన్, బాలీవుడ్ హీరోయిన్ కన్నా ఎక్కువగా పారితోషకం డిమాండ్ చేస్తూ ఉండడం అనేది సెన్సేషనల్ గా మారిపోయింది. ఈ తీరు చూస్తూ ఉంటే బాలీవుడ్ రంగంలో ఫ్యూచర్లో నయనతార ఒక రేంజ్ లోకి దూసుకుపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి