Narendra Modi : కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి లో ఆదివారం రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటించినున్నారు. ప్రధానమంత్రి రెండు రోజుల తిరుమల పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర బలగాలతో పాటు ఏపీ పోలీసులు కూడా బందోబస్తు చేపట్టారు. ఇక నరేంద్ర మోడీ వెంట గవర్నర్ అబ్దుల్ నాది రానుండగా…ప్రధాని బసచేసే శ్రీ రచన గెస్ట్ హౌస్ తో సహా ప్రముఖులు ఉండే అతిథిగృహాలను ఎస్ఎస్ జి బలగాలులు వారి ఆధీనంలోకి తీసుకున్నాను. అలాగే ప్రధాని ప్రయాణించే మార్గాలలో భారీగా భారీకేట్లను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
అయితే శనివారం రోజు కేంద్ర బలగాల అధికారులు ,పోలీసులు ఆలయ ప్రదేశాలను టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తో కలిసి పరిశీలించడం జరిగింది. అయితే ప్రధానమంత్రి హోదాలో మోడీ తిరుమల తిరుపతి శ్రీవారి దర్శనం చేసుకోవడం ఇది నాలుగోసారి. 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోడీ 2015 , 2017 ,2019లో తిరుమల దేవస్థానానికి విచ్చేసి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఇక కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత తిరుమలకు మోడీ రావడం ఇదే మొదటిసారి.
కాగా ప్రధాని ఆదివారం రోజు సాయంత్రం 6:50 నిమిషాలకు ప్రత్యేక విమానంలో తిరుపతికి చేరుకుంటారు. ఇక అక్కడినుండి రోడ్డు మార్గం ద్వారా 7:50 నిమిషాలకు తిరుమలలోని శ్రీరచన అతిథి గృహంలో బస చేస్తారు. అనంతరం సోమవారం ఉదయం 7:55 నిమిషాలకు శ్రీవారి దర్శనానికి వెళ్తారు. సోమవారం ఉదయం 8:05 నిమిషాలకు స్వామివారిని దర్శించుకుని అనంతరం 40 నిమిషాల వరకు ఆలయంలోనే ప్రధాని గడపనున్నారు. అనంతరం అక్కడినుండి అతిథిగృహానికి చేరుకుని కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత తిరుమల నుండి బయలుదేరి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ రానున్నట్లు సమాచారం.