Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఎప్పటికప్పుడు సరికొత్తగా ఆలోచిస్తూ కెరియర్ లో దూసుకెళుతోంది. మరోసారి తన మార్క్ చూపిస్తూ అరుదైన ఫిట్ ను సంపాదించుకుంది. ఇటీవల పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేసి దేశవ్యాప్తంగా ఫుల్ పాపులర్ అయింది. దీంతో అమ్మడుకి క్రేజ్ డబల్ అయింది. ఈ క్రమంలో సమంత ఫ్యాన్స్ సంతోషపడే న్యూస్ బయటకు వచ్చింది. ఆర్మార్క్స్ సంస్థ చేసిన సర్వేలో పాన్ ఇండియా స్థాయిలో మోస్ట్ పాపులర్ హీరోయిన్స్ టాప్ లిస్టులో సమంతకు తొలి స్థానం దక్కింది. పలువురు బాలీవుడ్ హీరోయిన్ల వెనక్కి నెట్టి మరి సమంత ఫస్ట్ ప్లేస్ కొట్టేసింది.
ఆర్మార్క్స్ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం మోస్ట్ పాపులర్ హీరోయిన్స్ జాబితాలో మొదటి స్థానంలో సమంత ఉంది. ఆ తర్వాత స్థానంలో వరుసగా అలియా భట్, నయనతార, కాజల్ అగర్వాల్, దీపికా పదుకొనే, కీర్తి సురేష్ కత్రినా కైఫ్, పూజ హెగ్డే,అనుష్క శెట్టి తదితరులు ఉన్నారు. సమంత ఈ అరుదైన ఫిట్ అందుకోవడం వల్ల ఫాన్స్ ఖుషి అవుతున్నారు. ఇది సమంత రేంజ్ అంటూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.
Samantha : ఇది సమంత రేంజ్…

టాప్ హీరోయిన్ గా నిలిచిన సమంత బాలీవుడ్ లో కూడా సత్తా చాటాలని గట్టి ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ లో వరుణ్ ధావన్ తో కలిసి ఓ వెబ్ సిరీస్ చేస్తుంది. అలాగే ఆయుష్మాన్ ఖురాన్ తో మరో సినిమాకు కమిట్ అయింది. తెలుగులో విజయ్ దేవరకొండ తో కృషి సినిమా చేస్తుంది. నాగచైతన్యతో నాలుగేళ్ల పాటు వివాహ బంధాన్ని కొనసాగించిన సమంత కొన్ని వ్యక్తిగత కారణాలతో విడిపోయింది. చైతుతో విడాకులు తీసుకున్నాక పూర్తిగా ఫోకస్ అంత కెరీర్ పైన పెట్టి వైవిద్య భరితమైన కథలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.