Tollywood : తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సాధించుకున్న యంగ్ హీరో నిఖిల్ పెళ్లయిన నాలుగేళ్ల తర్వాత తండ్రి స్థానాని పొందిన విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోలు ఉన్నప్పటికీ నిఖిల్ కున్న క్రేజ్ సపరేట్ అని చెప్పాలి. హిట్ ఫ్లాప్ అని సంబంధం లేకుండా మంచి మంచి కథలను ఎంచుకుంటూ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని నిఖిల్ ఏర్పరచుకున్నాడు.
ఈ క్రమంలో త్వరలోనే స్వయంభు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నిఖిల్ కెరియర్ లో ఇది 20వ సినిమాగా విడుదల కాబోతుంది. ఇక ఈ సినిమాతో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకోవడానికి ముందే నిఖిల్ అభిమానులకు మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చాడు. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అదే నిఖిల్ తండ్రి కాబోతున్నాడు. గతంలో నిఖిల్ భార్య ప్రెగ్నెంట్ అంటూ ఓ న్యూస్ తెగ చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే ఒక ప్రైవేట్ ఈవెంట్ లో పాల్గొన్న నిఖిల్ భార్య పల్లవి బేబీ బంప్ తో కనిపించడంతో ఈ వార్తలు వాస్తవాలని క్లారిటీ వచ్చింది. అయితే పల్లవి గర్భవతి అంటూ కథనాలు రావడమే తప్ప అఫీషియల్ గా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. దీంతో ఈ న్యూస్ మరింత వైరల్ అయింది. ఎట్టకేలకు ఇప్పుడు పల్లవి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.