Health Benefits : శరీరంలోని అవయవాలకు పునర్జీవనం చేసే ఔషధాలగని గలిజేరు మొక్క. ప్రకృతి ఔషధాల గని, వర్షాకాలం పడగానే ఎక్కడపడితే అక్కడ చకచకా మొలిచే కనిపించే అద్భుతమైన మూలికా గలిజేరు మొక్క.అత్యంత ప్రమాదకరమైన అనారోగ్యాలను వైద్యంగా, ప్రకృతిలో మొక్కల రూపంలో ఔషధాలను తయారు చేసుకోవచ్చును. ఈ తెల్లగన్నేరు మొక్కను ఆయుర్వేదంలో పునర్నవ అని కూడా అంటారు పునర్ అంటే తిరిగి నవ అంటే కొత్తగా అని అర్థం.అంటే తిరిగి కొత్తగా మన జీవితాన్ని మనకు అందిస్తుంది అని అర్థం. దీని శాస్త్రీయ నామం బోర్ హవ్య డిఫ్యూజ. ఆయుర్వేద మందుల్లో నొప్పిని తగ్గించే ఔషధంగా,రక్తాన్ని వృద్ధి పరచడానికి వాడే ఈ మొక్క వర్షాకాలంలో ఎక్కువగా లభిస్తుంది.
నేల మీద పాకే ఈ మొక్క మూడు రకాలు తెలుపు, ఎరుపు, మరియు నలుపు. ఔషధగుణాలు మూడింటిలో ఒకేలా ఉన్నా కూడా తెల్లగలిజేరు ఉత్తమంగా పని చేస్తుంది. వాటికి పుాచెే చిన్నచిన్న పూల రంగులను బట్టి అది ఏ రంగులో ఉందో నిర్ణయిస్తారు.తెల్లగలిజేరు, ఎర్రగలి జెేరు మనకి దగ్గరలో దొరుకుతుంది. కానీ నల్ల గలిజేరు చాలా అరుదుగా దొరుకుతుంది.గలిజేరు వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. తెల్లగలిజేరు నీ వేడి నీళ్లలో మరిగించి తాగితే కఫం, దగ్గు, తుమ్ము , విషము,పాడు రోగాలు, శరీరానికి కలిగే వాపులు,వాత వ్యాధులు కడుపుకి సంబంధించిన వ్యాధులు కాలేయ వాపును పొగుడుతుంది,గుండె బలహీనత వలన వచ్చిన వాపును పోగొడుతుంది. మూత్రపిండాలను బాగుచేసి సక్రమంగా పనిచేసేలా చేస్తుంది.ఈ తెల్లగలిజేరు మొక్కని నెలరోజులు తింటే కుష్టువ్యాధి గ్రస్తులకు కూడా నివారణ దొరుకుతుంది.
Health Benefits : తెల్లగలిజేరు (పునర్నవ)అనే మొక్క గురించి మీలో ఎంతమందికి తెలుసు?

గలిజేరు మొక్క వెరుని నీటిలో సనబెట్టి,దాన్ని కంటికి పెడితే రేచీకటి తొలిగిపోయి కంటి చూపు మెరుగుపడుతుంది. ఈ ఆకు వండుకొని తింటే కూడా రక్తం శుభ్రపడి వృద్ధి చెందుతుంది. నడక రాణి పిల్లలకు ఇదే తైలం మర్ధనం చేసి, తర్వాత స్నానం చేయిస్తే నడక వస్తుంది అని మూలికా వైద్యులు చెపుతారు. గలిజేరు ఆకు వేడి చేసి కడితే బోదకాలు తగ్గుతాయి. తెల్లగలిగజేరు ఆకులను నూరి మొఖానికి రాసుకుంటే మచ్చలు తగ్గుతాయి. ముఖం కూడా అందంగా తయారవుతుంది.ఇలా కొన్ని లాభాలు ఉన్నా దీనిని అందరూ తినకూడదు. ఈ ఆకుకూరలను అతిగా తినకూడదు తీవ్రమైన వృద్ధి రోగం ఉన్నవాళ్లు వైద్యుని సలహా తీసుకొని తినాలి డయాబెటిస్, అధిక రక్తపోటు ఉన్నవాళ్లు చలువచేసే పదార్థాలు అధికంగా తింటూ, ఈ ఆకుకూరలను మితంగా తినాలి.
పాలిచ్చే తల్లులు గర్భిణీలు ఈ ఆకుకూరలను తినకూడదు. ఆరోగ్యం బాగా వున్నవాళ్ళు వర్షాకాలంలో వారానికోసారి తిన్నా మనకు దీనిలో ఉన్న పోషక విలువలు పుష్కలంగా దొరుకుతాయి. కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్లు వారానికి రెండు,మూడుసార్లు పప్పులో వండుకొని తింటే మంచిది. ఈ ఆకును తింటే కిడ్నీ సమస్య ఉన్నవారికి ఆరోగ్యం త్వరగా మెరుగుపడుతుంది. ఈ ఆకు ప్రతీ కణానికి ఆరోగ్యాన్ని ఇచ్చి పునర్జీవనం చెయ్యగలదు.కనుకనే పునర్నవి అంటారు.ఈ పునర్నవి ఆకు పల్లెటూరులో అధికంగా దొరుకుతుంది. ఎక్కడపడితే అక్కడ దొరుకుతుంది కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటే ఈజీగా పెంచుకోవచ్చు.ఇది మార్కెట్లో కూడా దొరుకుతుంది.
చాలామంది మహిళలు సుఖప్రసవం అవడం కోసం ఈ ఆకును బట్టలొ కట్టుకొని ఎడమ తొడ కు కట్టుకుంటారు. దీనివల్ల సుఖ ప్రసవం అవుతుందని చాలామంది చెప్పారు. మూత్ర బిగింపు సమస్య ఉన్నవారు ఒక పది గ్రాముల గలిజేరు ఆకు రసాన్ని ఒక కప్పు ఆవుపాలతో కలిపి త్రాగటం వలన మూత్ర బిగింపు సమస్య తగ్గుతుంది.మూత్రం ధారాళంగా రావడానికి సహాయపడుతుంది. తెల్లగలిజేరు ఆకును దంచి ఆ రసం కొంచెం నీటితో కలిపి వడపోసి తాగడం వలన సుఖ విరోచనాలు అవుతాయి.చాలామంది తెలియక ఆ మొక్కని పిచ్చి మొక్క అని అనుకుంటారు. కానీ ఈమొక్క వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి.