Weight Loss : ప్రస్తుత కాలంలో అధిక బరువు సమస్యతో చాలామంది బాధపడుతున్నారు రోజు ఎన్నో ఎక్సర్సైజులు, యోగాలు వంటివి చేసి బరువును తగ్గించుకోవాలనుకుంటున్నారు కానీ ఫలితం మాత్రం కనిపించదు. ఈరోజుల్లో ప్రతి ఒక్కరు స్మార్ట్ గా అందంగా కనిపించాలని అనుకుంటున్నారు. అందుకే ప్రతి ఒక్కరు తమ బరువును తగ్గించుకోవడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. బరువు తగ్గడానికి ఎన్నో రకాల వ్యాయామాలు చేస్తారు. అంతేకాకుండా అన్ని రకాల డైట్ లు కూడా ఫాలో అవుతారు
ఇటువంటి సమయంలో కొన్ని తప్పులు చేస్తే బరువు తగ్గటానికి బదులుగా బరువు పెరుగుతారు. దీంతో ఏం చేయాలో అర్థం కాక నిరాశ చెందుతారు. దీనికి ప్రధాన కారణం బరువు తగ్గే సమయంలో కొన్ని తప్పులు చేస్తే పరువు పెరుగుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి బరువు తగ్గే సమయంలో ఎటువంటి తప్పులు చేయకూడదు తెలుసుకుందాం
బరువు తగ్గే సమయంలో ఈ తప్పులను చేయకండి.
ఎక్కువ సేపు ఒకే చోట కూర్చోవడం :
ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవడం వల్ల మీ శరీరం లై పేస్ ఉత్పత్తిని నిలిపివేస్తుంది. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. అందుకే ఎక్కువ సేపు ఒకే చోట కూర్చోకుండా కాసేపు అటు ఇటు నడవడం మంచిది.
Weight Loss : ఇటువంటి పొరపాట్లు చేస్తే అసలు బరువు తగ్గరు… 
if u do this mistakes do not lose your weight and face this health problems
సరిగా నిద్ర లేకపోవడం :
బరువు తగ్గే సమయంలో నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది. మీరు ఆరు గంటల నుంచి 8 గంటల వరకు నిద్ర లేకపోతే అది మీ బరువుపై ప్రభావం చూపుతుంది. ఎందుకంటే ఎనిమిది గంటలు నిద్రపోయే వాళ్ళు జీర్ణక్రియ చురుగ్గా పనిచేస్తుంది. ఇలాంటి వారి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
సరిగా ఆహారం తీసుకోకపోవడం:
చాలామంది ఆహారం తక్కువ తింటే ఈజీగా బరువు తగ్గుతారని అపోహ పడుతున్నారు. ఇది వాస్తవానికి నిజం కాదు ఎందుకంటే పూర్తిగా ఆహారం తీసుకోలేకపోవడం వల్ల మలబద్దక లాంటి సమస్యలు పెరుగుతాయి. మీరు బరువు తగ్గటానికి బదులు పెరుగుతారు. అదేవిధంగా తక్కువ ఆహారం తీసుకున్నట్లయితే. మెదడు ఇబ్బందుల్లో ఉన్నామని గ్రహిస్తుంది దీంతో పాటు బరువు పెరగటం మొదలవుతుంది.