Jaggery Benefits : తీపి తినడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు. స్వీట్ వంటకాల రుచిని పెంచడంలో బెల్లం ముందంజలో ఉంటుంది. ఆయుర్వేదంలో బెల్లాన్ని మంచి ఫుడ్డు గా పరిగణించారు. బెల్లం తీపిని తినాలనే కోరిక తీర్చడమే కాకుండా, వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలగజేస్తుంది. బెల్లం ఒక అద్భుతమైన శక్తి బూస్టర్. ఇది కండరాల్లో బలాన్ని అధికం చేయడానికి పనిచేస్తుంది. బెల్లం ప్రోటీన్, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, సుక్రోచ్ ,మంగనిష్, కొవ్వు యొక్క అద్భుతమైన మూలం. బెల్లం రక్తహీనత సమస్యలను దూరం చేస్తుంది.
బెల్లం అనేది మొక్కల ఆధారిత ఆహారం, ఇది వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు ఉపయోగపడుతుంది. బెల్లం ఎటువంటి సమస్యలకు చక్కటి పరిష్కారాన్ని చూపుతుందో తెలుసుకుందాం. బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల ఇనుము యొక్క మంచి మూలకం గా పరిగణింపబడింది. ఇది రక్తంలోని సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. 200 గ్రాములు బెల్లం లో 20 మిల్లీగ్రాముల ఇనుము ఉంటుంది.
Jaggery Benefits : బెల్లంతో అధిక శక్తి…. మరియు బోలెడు ప్రయోజనాలు.

మన బాడీలో ఐరన్ లోపం ఉన్నట్లయితే బెల్లం తీసుకోవడం ఉత్తమం. భోజనం చేసిన తర్వాత బెల్లం తీసుకోవడం చాలా మంచిది. ఇలా తీసుకోవడం వల్ల జీర్ణక్రియకు మేలు కలుగుతుంది. దీనిలో సుక్రోజ్ అధికంగా ఉంటుంది. ఇది ఆహారాన్ని జీర్ణం చేయడానికి, మలబద్ధకం నుంచి ఉపశమనం పొందేందుకు సహాయపడుతుంది. దీనిని తరచుగా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ సమస్యలు కూడా దూరమవుతాయని చెబుతున్నారు నిపుణులు