బీఆర్ఎస్ ఎంట్రీకి దారులు మూసుకుపోయినట్టేనా..?

ఏపీ , ఓడిశా రాష్ట్రాలకు బీఆర్ఎస్ ఇంచార్జ్ లను నియమించారు కానీ పార్టీకి గుర్తింపు లభించేలా ఎలాంటి కార్యాచరణ రూపొందించలేదు. ఈ క్రమంలోనే ఏపీలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశం అందివచ్చిన అవకాశంగా మలుచుకోవాలని చూసింది బీఆర్ఎస్. ఇందుకోసం బిడ్ దాఖలు చేస్తామని స్పష్టం చేసింది. తమకు ఐదు రోజుల గడువు కావాలని కూడా కోరింది. దీంతో స్టాల్ ప్లాంట్ అంశంలో బీఆర్ఎస్ చూపిస్తోన్న చొరవతో ఏపీలో బీఆర్ఎస్ కు కొంత ఊపు వచ్చే పరిస్థితులు కనిపించాయి. కట్ చేస్తే సింగరేణితో తెలంగాణ సర్కార్ బిడ్ దాఖలు చేయలేదు. దీంతో స్టాల్ ప్లాంట్ అంశంలో బీఆర్ఎస్ పోరాటమంతా పార్టీ విస్తరణ కోసం తప్ప స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కాదని పెదవి విరుపులు ప్రారంభమయ్యాయి.

Advertisement

స్టీల్ ప్లాంట్ బిడ్ లో పాల్గొంటామని ఈమేరకు సభ నిర్వహిస్తామని బీఆర్ఎస్ ప్రకటించింది కూడా. ఇప్పుడు బిడ్ లో పాల్గొనకపోవడంతో బీఆర్ఎస్ నిర్వహించాలనుకున్న సభ నిర్వహణకు అవకాశమే లేకుండా పోయింది. దీంతో బీఆర్ఎస్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది. విశాఖ ఉక్కులో బీఆర్ఎస్ చొరవను ముందుంచి సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణను పార్టీలోకి చేర్చుకోవాలనుకున్నారు. ఆయనతో టచ్ లోకి కూడా వెళ్లారు. కానీ ఆయన బీఆర్ఎస్ లో చేరికపై అప్పుడే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని భావించారు. బిడ్ వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించగానే కేసీఆర్ ను ప్రశంసించింది లక్ష్మీనారాయణే. ఇప్పుడు బిడ్ లో పాల్గొనకపోవడంతో లక్ష్మినారాయణ బీఆర్ఎస్ లో చేరికపై వెనక ముందు ఆలోచించాల్సిన పరిస్థితులు దాపురించాయి.

Advertisement

బీఆర్ఎస్ విస్తరణకు మహారాష్ట్రలో ఓ రూపంలో స్పెస్ దొరికింది. శివారు ప్రాంతాలు అభివృద్ధి చెందకపోవడంతో తెలంగాణ డెవలప్ మెంట్ ను వివరించి అక్కడ నుంచి బీఆర్ఎస్ ను బిల్డ్ చేయాలని చూస్తున్నారు. ఓడిశాలో ఏం అంశం ఆధారంగా రాజకీయం స్టార్ట్ చేయాలని సమాలోచనలు జరుగుతున్నాయి. ఏపీలోనూ మొన్నటి వరకు అంతగా రాజకీయం చేసేందుకు పట్టు దొరకలేదు. కానీ స్టీల్ ప్లాంట్ అంశంతో పార్టీ విస్తరణకు అవకాశం దొరికిందని అనుకున్నారు కానీ ఈ వ్యూహం బెడిసికొట్టింది. పైగా.. ఏపీ ప్రజల మనోభావాలకు సంబంధించిన విశాఖ ఉక్కుఅంశంతో రాజకీయాలు చేస్తారా..? అంటూ బీఆర్ఎస్ ను తిట్టిపోస్తున్నారు. ఇప్పుడు ఏపీలో పార్టీ విస్తరణకు ఎలాంటి మార్గం బీఆర్ఎస్ వెతుక్కుంటుందో చూడాలి.

Advertisement