సీఎం పదవి రేపుతోన్న ప్రకంపనలు – రేవంత్ రెడ్డితో కలిసి డీకే శివ కుమార్ కొత్త పార్టీ..?

కర్ణాటక కాంగ్రెస్ సీఎం చైర్ విషయంలో మనస్తాపానికి గురైన కేపీసీసీ అద్యక్షుడు డీకే శివ కుమార్ ఆ పార్టీని వీడుతున్నారా…? శివ కుమార్ కు బర్త్ డే విషెస్ చెప్పిన టీపీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డి తరువాత కన్నాడనాట ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై శివ కుమార్ తో కలిసి చర్చించారా..? అనంతరం సంచలన నిర్ణయం తీసుకునేందుకు రెడీసంసిద్దత వ్యక్తం చేశారా..? ఇద్దరు కలిసి కాంగ్రెస్ అనే పేరు వచ్చేలా కొత్త పార్టీని పెట్టనున్నారా..? అంటే సోషల్ మీడియాలో మాత్రం ఇదే ప్రచారం జరుగుతోంది.

Advertisement

కన్నడనాటన కాంగ్రెస్ విజయమైతే సాధించింది కానీ సీఎంగా ఎవరిని కూర్చోబెట్టాలనే విషయంలో హైకమాండ్ క్లారిటీ ఇవ్వలేకపోతుంది. సీఎం పదవి కోసం సీనియర్ నేత సిద్దరామయ్య, కేపీసీసీ అద్యక్షుడు డీకే శివ కుమార్ లు తీవ్రంగా పోటీపడుతున్నారు. మధ్యేమార్గంగా చెరో రెండున్నరేళ్ళు అనే ప్రతిపాదనను ఈ ఇద్దరి నేతల ముందు ఉంచగా సిద్దరామయ్య ఒకే చెప్పారు. శివ కుమార్ మాత్రం అభ్యంతరం వ్యక్త్యం చేశారు. దీంతో ఢిల్లీకి రావాలని సిద్దరామయ్యను పిలిచిన హైకమాండ్ ఆయనకు నచ్చజెప్పి డీకే శివకుమార్ కు సీఎం బాధ్యతలు కట్టబెడుతుందా..? లేక సిద్దరామయ్యనే సీఎంగా ప్రకటిస్తారా..? అనేది రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంట రేకెత్తిస్తోంది.

Advertisement

అయితే.. డీకే శివ కుమార్ కూడా ఢిల్లీకి వెళ్తారని ఉదయం నుంచి ప్రచారం జరిగింది. సడెన్ గా సిద్దరామయ్య ఒకరే ఢిల్లీ వెళ్ళారు. నేడు డీకే శివకుమార్ పుట్టిన రోజు కావడంతోనే ఆయన ఢిల్లీ వెళ్ళలేదని అంటున్నారు. కానీ సీఎం పోస్ట్ కు సంబంధించిన వ్యవహారం కొనసాగుతున్నప్పుడు జన్మదిన వేడుకలకే శివ కుమార్ ప్రాధాన్యత ఇచ్చే అమాయకుడు ఏమాత్రం కాడన్న వాదనలు సర్వత్ర వ్యక్తం అవుతున్నాయి. అయితే… డీకేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు ఆయన నివాసానికి రేవంత్ వెళ్ళడం ప్రాధాన్యత సంతరించుకుంది.

డీకే అలకపాన్పు ఎక్కినా వేళ రేవంత్ ఆయనతో ఏం మాట్లాడారన్నది చర్చనీయాంశం అవుతోంది. అయితే… కర్ణాటకలో డీకే ఎలాగైతే సీనియర్ల నుంచి ఆధిపత్యపోరును ఎదుర్కొంటున్నారో… అచ్చం రేవంత్ ది కూడా తెలంగాణలో అదే పరిస్థితి. రేపు తెలంగాణలోనూ సీనియర్లంతా ఏకమై పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినా నీకు సీఎం పదవి దక్కకుండా సిద్దరామయ్య మాదిరి సీనియర్లు ఎగరేసుకోపోతారని రేవంత్ – డీకే ల మధ్య సంబాషణ నడిచిందని ప్రచారం జరుగుతోంది. దీంతో శివ కుమార్ కు సీఎం పదవి రాకపోతే రేవంత్ కూడా ఆయనతో కలిసి కొత్త పార్టీ ఏర్పాటులో పాల్గొంటారని అంటున్నారు.

అయితే ఇదంతా బీజేపీ నేతల ప్రచారమేనని… ఇలాంటి అసత్య ప్రచారం చేసి కర్ణాటకలో ఓడినా ఇంకా సిగ్గు రాలేదని.. ఇప్పుడు డీకే అసంతృప్తిని ముందుంచి రాజకీయం చేయాలనీ చూస్తోందని కాంగ్రెస్ నేతలు కొట్టిపారేస్తున్నారు.

Advertisement