horoscope August 2022 Zodiac Signs for Aquarius
Zodiac Signs : ఆగస్టు నెలలో 2022 వృశ్చిక రాశి వారు కి గ్రహస్థితి ఏవిధంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మేషరాశిలో కుజుడు, రాహువు కలిసి ఉంటారు. 11వ తేదీ వరకు కలిసి ఉండి, 11వ తేదీ నుండి వృషభంలోకి కుజుడు చేరుకుంటాడు. అలాగే మిధునంలోనే ఉన్నటువంటి శుక్రుడు ఏడో తేదీ నుండి కర్కాటకంలోకి వస్తాడు. అదేవిధంగా కర్కాటకంలోని ఉన్నటువంటి రవి 16వ తేదీ నుంచి సింహంలోకి వెళ్తాడు. సింహం లో ఉన్న బుధుడు, చంద్రులు కలిసి ఉంటారు.
ఆ యొక్క బుధుడు 21వ తేదీ వరకు సింహరాశిలో ఉండి తర్వాత కన్య రాశిలోకి వెళ్తాడు. అలాగే వృశ్చికంలోని కేతువు, మకరంలోని వక్రరించినటువంటి గురువు ఉన్నారు.ఈ కుంభ రాశి వారికి చూసుకున్నట్లయితే.. ఈ రాశి యొక్క రాసినాధుడు వ్యయ స్థానంలో ఉన్నాడు. కాబట్టి విదేశాలకు వెళ్లేవారు, మనీ ఇన్వెస్ట్మెంట్ చేసేవారు. కొన్ని జాగ్రత్తలు వహించాలి. అలాగే సొంత బిజినెస్ చేయాలనుకున్న వారికి చాలా అనుకూలమైన గ్రహస్తితులు ఉన్నాయి.
ఈ మాసంలో, మూడవ తేదీ నుండి 11వ తేదీ వరకు ఈశివారు మొండి వైఖరి కలిగి ఉంటారు. అయితే ఈ మొండి వైఖరి వలన కొన్ని విషయాలలో మంచి జరగనున్నది. కొన్ని విషయాలలో చెడు జరగనున్నది. అదేవిధంగా ఈ కుంభ రాశి వారికి చూసుకున్నట్లయితే గృహాలు, భూములు ఏదైనా రియల్ ఎస్టేట్ ప్లేసులు అమ్మినట్లయితే మంచి అనుకూలత పొందుతారు. కానీ కొనుగోలు చేయాలి అనుకున్న వారు మాత్రం అన్ని విధాల చూసుకొని కొనుగోలు చేయండి. అలాగే కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
అలాగే ప్రేమ వ్యవహారాలలో మంచి ఫలితాలను పొందుతారు. అలాగే రుణాల విషయాలలో కూడా మంచి ఫలితాన్ని అందుకుంటారు. వివాహానికి సంబంధించిన విషయాలలో, మీ తల్లిదండ్రులు యొక్క ఆధీనంలో వివాహం జరిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈ రాశి వారు బంధువర్గంలో వారిని ఇష్టపడి వివాహం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే ఏడవ తేదీ నుండి 16వ తేదీ వరకు మీరు ఇష్టపడిన వారిని వివాహం చేసుకునే అవకాశం బాగా కనిపిస్తుంది.
రుణాలు కూడా అందే అవకాశం బాగా కనిపిస్తుంది. కానీ బ్యాంకు ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు వహించాలి. అయితే ఈ రాశి వారికి అన్ని విధాల మంచి ఫలితాలను పొందాలంటే…ఈ కుంభ రాశి వారు చేయవలసిన దేవతారాధన: లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన చేయాలి. అలాగే శుక్ర , కేతువు, కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అన్ని విధాల మంచి ఫలితాలను పొందుతారు
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…