aishwarya rai act in rajamouli mahesh babu combination movie
Rajamouli : రాజమౌళి ఓటమి ఎరుగని దర్శకుడు. ఏ సినిమా చేసినా బ్లాక్ బస్టర్ గ్యారంటీ. RRR మూవీతో పాన్ ఇండియా లెవెల్ ల్లో భారీ విజయం ను ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు రాజమౌళి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టాడు. అందులో భాగంగా ఇప్పుడు మహేష్ బాబు తో ఒక భారీ ప్రాజెక్ట్ చేపట్టబోతున్నారు అని సమాచారం. ఈ సినిమా కూడా పన్ ఇండియా లెవెల్ లో వస్తున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ రాజమౌళి ఫ్యాన్స్ తో పాటు అటు మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను కే ఎల్ నారాయణ నిర్మించగా, శ్రీ దుర్గా భవాని ఆర్ట్స్ బ్యానర్ పై వస్తుంది. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో రావటం తో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నట్లు సమాచారం.
ఇప్పటికే ఈ సినిమాకు సంబధించిన స్క్రిప్ట్ పనులు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ పూర్తి చేసినట్లు సమాచారం. ఈ సినిమా సౌత్ ఆఫ్రికా అడవుల నేపథ్యం లో సాగే భారీ ఎడ్వంచేర్ మూవీ గా తెరపైకి రానున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన నటి నటుల విషయం లో జక్కన్న ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ పాత్రంకోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు గా తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు పాన్ ఇండియా మూవీ కావడం తో దానికి తగ్గట్టుగా హీరోయిన్ కూడా పాన్ ఇండియా లెవెల్ చేసిన సాహో బ్యూటీ శ్రద్ధ కపూర్ ను అనుకున్నట్లు తెలుస్తుంది. ఇదే కనుక నిజం అయితే ఇది కూడా క్రేజీ కాంబినేషన్ అవుతుంది.
అంతే కాకుండా ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్ర కోసం బ్యూటీ క్వీన్ ఐశ్వర్య రాయ్ ను అనుకున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో ఆమెకోసం ఒక ప్రత్యేక పాత్ర రేడీ చేస్తున్నట్లు వినికిడి. ఇదే నిజం అయితే ఈ సినిమా వేరే రేంజ్ లో ఉండడం ఖాయం గా కనిపిస్తుంది. అయితే మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో SSMB28 త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు అర్జునుడు టైటిల్ అనుకున్నట్లు తెలుస్తుంది. గతం లో త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో అతడు, ఖలేజా, వంటి మంచి హిట్లు మనకు తెలుస్తుంది.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…