Anuska shetty marriage news real or fake
Anushka : టాలీవుడ్ లో అనుష్క సినిమాల ద్వారా ఓ ప్రభంజనం సృష్టించింది అని చెప్పవచ్చు. ఈ అందాల భామ చేసిన ప్రతి సినిమాలో తనదైన నటన మరియు అందంతో ప్రతి సినిమాలో తానే హైలెట్ గా నిలుస్తూ టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలిగింది. సూపర్ సినిమాతో తెలుగులో అడుగుపెట్టిన ఈ భామ మొదటి సినిమా నుంచి తన హవా మొదలుపెట్టింది. అనుష్క ప్రభాస్ తో చేసిన విక్రమార్కుడు సినిమాతో మరింత క్రేజ్ తెచ్చుకుంది. ఆ తరువాత ఇక వెనక్కి తిరిగి చూడలేదు అంతలా ఇండస్ట్రీలో అవకాశాలతో దూసుకెళ్లింది ఈ భామ.
అయితే ఇప్పుడు ఒక తాజా సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈమెకి పెళ్లి కుదిరినట్లు వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. బెంగళూరుకు చెందిన ఓ పారిశ్రామికవేత్తని అనుష్క పెళ్లాడబోతుందని తాజాగా వార్తలు వచ్చాయి. ఈ విధంగా ఈ వచ్చిన వార్తలు ఈసారైనా నిజమవుతాయా లేదా అనేది వేచి చూడాలి. ఎందుకంటే ఈమధ్య సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు రావడం చాలా కామన్ అయిపోయింది. అంతేకాకుండా అనుష్క ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో చాలా సీనియర్ నటి. అంతేకాకుండా ఈమెకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.’
ఈమె పెళ్లంటే ఓ రేంజ్ లో ఉంటుంది కాబట్టి వార్తలు పక్కాగా వస్తాయి. ప్రస్తుత కాలంలో ఈమె సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. చివరిగా ఈమె చేసిన నిశ్శబ్దం సినిమా తర్వాత మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై ఈమె కనిపించలేదు. ఈమె తో సినిమా చేయడానికి చాలామంది ఆసక్తి చూపినప్పటికీ సుముఖత చేయకపోవడంతో ఒక ప్రాజెక్టు కూడా రాలేదు. అయితే నవీన్ పోలిశెట్టి హీరోగా మహేష్ పి దర్శకత్వంలో ఓ సినిమా ఒప్పుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంత నిజం ఉన్నదనేది తెలియాల్సి ఉంది. అంతేకాకుండా అనుష్క పెళ్లిపై కూడా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…