Chiranjeevi and Vijay Devarakonda expressed their happiness at the box office
Tollywood : జూలై నెలలో థియేటర్స్ దగ్గర జనాలే కరువయ్యారు. అసలు ఏ సినిమా వచ్చిన దానికి నెగెటివ్ టాక్ రావడం, ఒక్కరు కూడా థియేటర్ వంక చూడకపోవడం జరుగుతుంది. ఈ క్రమంలో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ సందిగ్ధంలో పడింది. థియేటర్స్‌కి ప్రేక్షకులు వస్తారా రారా అనే అనుమానం వ్యక్తం అవుతున్న సమయంలో సీతారామం, బింబిసార చిత్రాలు విడుదలై కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి. ఈ క్రమంలో రెండు సినిమాలు విజయాలు సాధించడంపై సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ కళకళలాడుతుందంటూ రెండు సినిమాలకు అభినందనలు తెలియజేస్తున్నారు.
ప్రముఖుల హర్షం..అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి తాజాగా ట్విట్టర్ ద్వారా అభినందించారు. `ప్రేక్షకులు సినిమా థియేటర్లకి రావడం లేదని బాధపడుతున్న ఇండస్ట్రీకి ఎంతో ఊరటనీ, మరింత ప్రోత్సాహాన్నిస్తూ కంటెంట్ బావుంటే ప్రేక్షకులెప్పుడూ ఆదరిస్తారని మరోసారి నిరూపిస్తూ నిన్ను విడుదలైన చిత్రాలు రెండు విజయం సాధించడం ఎంతో సంతోషకరం. ఈ సందర్భంగా “, `బింబిసార` చిత్రాల నటీనటులకు, నిర్మాతలకు, సాంకేతిక నిపుణులకు నా మనః పూర్వక శుభాకాంక్షలు` అని తెలిపారు చిరంజీవి.
ఇక ఒకే రోజు విడుదలైన రెండు చిత్రాలు హిట్ టాక్‌ని సంపాదించుకోవడం సంతోషంగా ఉందని విజయదేవరకొండ ట్వీట్ చేశాడు. సీతారామం, బింబిసార చిత్రాల విజయంపై యంగ్ హీరో అడివి శేష్ కూడా స్పందించాడు. తనకు కొవిడ్ రావడంతో ఐసొలేషన్‌లో ఉన్నానని… తన కోసం ఉదయం ఒక సినిమా, తర్వాత మరో సినిమా చూడమని అడివి శేష్ ట్వీట్ చేశాడు. ఎన్టీఆర్ కూడా బింబిసార మూవీ సక్సెస్ పై సంతోషం వ్యక్తం చేశారు. చాలా మంది ప్రముఖులు థియేటర్ దగ్గర సందడి చూస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎంత మంచి వాడవురా సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ నుంచి వచ్చిన సినిమా ‘బింబిసార’. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత మల్లిడి సత్యనారాయణ రెడ్డి తనయుడు వశిష్ఠ తెరకెక్కించారు.ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తోన్న ఈ చిత్రానికి కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ పేరును నిర్మాతగా పరిచయం చేసారు కళ్యాణ్ రామ్. గతంలో విడుదల చేసిన పోస్టర్‌లో ‘ఏ టైమ్ ట్రావెల్ టూ ఈవిల్ టూ గుడ్’. చెడు నుంచి ఎలా జరిగిందనేదే ఈ సినిమా స్టోరీ అనేది ట్యాగ్ లైన్.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…