chiranjeevi-is-sick-and-walking-with-the-help-of-a-stick
Megastar Chiranjeevi : ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆర్తోస్కోపిక్ విధానంలో ఇన్ఫెక్షన్ తొలగించుకున్న చిరంజీవి ప్రస్తుతం విశ్రాంతి దశలో ఉన్నారు.అంటే చిరంజీవి ఇప్పట్లో సినిమా షూటింగ్లలో హాజరయ్యే పరిస్థితి కనిపించడం లేదు.ఇటీవల బోళ శంకర్ సినిమా విడుదల తర్వాత కాస్త సమయం దొరకడంతో చిరంజీవి ఈ చికిత్సకు ఉపక్రమించారు. ఎందుకంటే ఆయనకు ఈ మోకాళ్ళ నొప్పి ఎన్నో రోజులుగా తీవ్ర ఇబ్బందిని కలిగిస్తుంది . వరుసగా సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉన్న ఆయన బోళ శంకర్ సినిమా అనంతరం కాస్త సమయం దొరకడంతో ఈ సర్జరీ చేయించుకున్నట్లు తెలుస్తోంది.
అంటే ఆర్తోస్కోపీ వాస్ ట్రీట్మెంట్ ద్వారా ఈ చికిత్స తీసుకున్నారు.దీంతో ప్రస్తుతం చిరంజీవి ఇంట్లో కర్ర సహాయంతో నడుస్తున్నట్లు సమాచారం. అలాగే మోకాలికి సంబంధించి ఇంకొన్ని ఎక్సర్సైజులు మరియు ఫిజియోథెరపీ ఫిట్టింగ్స్ ఉండడం మూలాన ఆయన బయటికి ఎక్కడికి కదిలే పరిస్థితి కనిపించడం లేదు. ఈ కారణంగానే ఇటీవల జరిగిన ఏఎన్ఆర్ శతజయంతి ఉత్సవాలలో జీరంజీవి పాల్గొనలేక పోయారు. అందుకే తనకు బదులుగా రామ్ చరణ్ ని పంపించినట్లు సమాచారం.
ఇది ఇలా ఉండగా ప్రస్తుతం ఆయన కళ్యాణ్ కృష్ణ సినిమాని పక్కనపెట్టి, యు.వి క్రియేషన్స్ సినిమాను ముందుకు తీసుకువచ్చారు. ఇక ఈ సినిమాలో అనుష్క హీరోయిన్ గా ఎన్నికైనట్టు సమాచారం. అయితే ఆమె ఓ మలయాళ సినిమాలో పాల్గొంటున్న కారణంగా డేట్స్ దొరకడం లేదట. ఏది ఏమైనా సరే చిరంజీవి సినిమా అంటే పాటలు మరియు ఫైట్స్ కంపల్సరిగా ఉండాల్సిందే.లేదంటే చిరంజీవి అభిమానులు ఓ రేంజ్ లో ఫైర్ అవుతారు. మరి మోకాలు శస్త్ర చికిత్స చేయించుకున్న అనంతరం ఇలాంటి సన్నివేశాలు చేయాలంటే కాస్త కష్టమైన చెప్పాలి. దీంతో మరో రెండు నెలలు చిరంజీవి రెస్ట్ తీసుకుంటారని సమాచారం.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…