Guppedantha Manasu 16 September 2022 Episode
Guppedantha Manasu 16 September 2022 Episode : గుప్పెడంత మనసు సీరియల్ 16-September-2022 ఎపిసోడ్ 557 ముందుగా మీ కోసం. వసుధార గదిలో రెడీ అవుతూ ఉంటూ, అద్దంలో చూస్తూ వుండగా, రిషి వెనకనించి వస్తాడు, రిషిని చూసి వసుధార షాక్ అవుతుంది, ఇలా వీళ్లిద్దరి మధ్య రొమాంటిక్ సీన్ మొదలయ్యే సమయంలో, దేవయాని అక్కడికి వచ్చి, ఇక్కడేం చేస్తున్నావ్ రిషి అనడంతో, ఏం లేదు పెద్దమ్మ అంటాడు, ఇప్పుడు ఈ డ్రెస్ బాగుంది, ఇంతకు ముందు వేసుకున్న డ్రెస్ ఎప్పుడు వేస్కోకు రిషి అని చెపుతుా, వసుధార వైపు కోపంగా చూస్తూ ఉంటుంది.అందరూ కిందికి దిగుతారు, సెలబ్రేషన్స్ మొదలవ్వబోయే టైమ్లో, రిషి వసుధార లను చూసి మహేంద్ర అంటూ ఉంటాడు వీళ్ళ జంట ఎంత బాగుందో అని, జగతి అంటుంది నా కొడుకుకు దిష్టి పెట్టకు అని, వీళ్లు ఇలా సరదాగా ఉంటే, దేవయాని సెలబ్రేషన్స్ చేసుకుంటావా చూస్తాను అని కోపంగా అనుకుంటూ ఉంటుంది మనసులో,రిషి జగతికి వెడ్డింగ్ డే విషెస్ చెబుతూ ఉంటాడు.
ఇలా అందరూ సంతోషంగా ఉంటారు, గౌతమ్ పిలుస్తాడు అంకుల్ కేక్ రెడీ అయింది రండి అని, కేక్ కట్ చేస్తూ ఉంటారు జగతి, మహేంద్ర. మహేంద్ర కేక్ కట్ చేసి, ముందు రిషికి తినిపించబోతుా ఉంటే, మహేంద్ర చేతిని పట్టుకొని రిషి జగతి మేడం వైపు తిప్పుతాడు, దాంతో మహేంద్ర జగతికి కేక్ తినిపిస్తాడు, అప్పుడు రిషి మనసులో అనుకుంటాడు, మీ ఆనందం కోసం ఇది ఒప్పుకున్నాను, మీ ఆనందమే నా ఆనందం అని అనుకుంటూ ఉంటాడు రిషి మహేంద్రకి కేక్ తినిపిస్తాడు, జగతికి చేతికి ఇస్తాడు కేక్ తినమని, తరువాత జగతి రిషి కి కేక్ ఇస్తే రిషి తీసుకుంటాడు, తరవాత వసుధార, ఇలా అందరూ తినిపిస్తూ ఉంటారు, జగతి మహేంద్ర ఇలా సంతోషంగా ఉంటారు. వసుధ రామ్ పక్కకి వెళుతుంది ఏంటి కనిపించడం లేదు, చీరతో ఏమన్నా ఇబ్బంది పడుతుందా అని, వసు ని వెతకడం కోసం రిషి వెళతాడు, అక్కడ రిషిని వెనకాల నుంచి వచ్చి వాటేసుకుంటుంది వసుధార, థాంక్యూ సార్ మీకు ఎన్ని థాంక్స్ చెప్పినా తక్కువే.
ఈరోజు జగతి మేడం, మహేంద్ర సార్ చాలా సంతోషంగా ఉన్నారు అని,ఇది అంతా మీ వాళ్ళ అని, ఇలా చెబుతూ ఉంటుంది రిషితో, తర్వాత లోపలికి వెళతారు, ఏంటి ఎక్కడికి వెళ్లారు ఇంతసేపూ అని గౌతమ్ అనడంతో, కాలేజ్ మీటింగ్ ఉంటే వెళ్లొచ్చాము అని అనడంతో, నీకు ఈమధ్యన వెటకారం ఎక్కువైందిరా అనడంతో, ఆ అవును రా అని రిషి అంటాడు. అలా సరదాగా వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ పూర్తయిన తరువాత, రిషి మహేంద్ర ఒక దగ్గర, జగతి వసుధార ఒక దగ్గర ఉంటూ మాట్లాడుతూ ఉంటారు. వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అనే దాని గురించి కొద్దిసేపు వీళ్లు మాట్లాడుకుంటూ ఉంటారు. తరవాత మహేంద్ర రిషిని అడుగుతాడు, అంత సేపు మీరు ఫంక్షన్ మధ్యలో ఎక్కడికి వెళ్లారు అని అనడంతో రిషి సిగ్గుపడుతూ డాడ్ అలా అడుగుతున్నారు ఏంటి అని అంటాడు, ఒకవైపు జగతి కూడా వసుధారాణి అదే ప్రశ్న అడగడంతో,వసుధార మేడమ్ రిషి సార్కి కృతజ్ఞత చెప్పాను అంతే అని ఉంటుంది, ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…