Categories: entertainmentNews

Guppedantha Manasu 19th July Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ 19-july-2022 ఎపిసోడ్ ముందుగా మీ కోసం. రిషి ఇచ్చిన డ్రెస్సెస్ను తీసుకున్న వసుధార వాటిని తిరిగి ఇస్తుందా లేదా

Guppedantha Manasu 19th July Today Episode : సాక్షి మనసులో నేను వసుధార గురించి ఒక్క మాట అంటే రిషి ఇంతలా ఆలోచిస్తాడా, నేను ఎంత దూరం చేయాలని ప్రయత్నిస్తే అంత దగ్గరవుతున్నారా అని, మనసులో అనుకుంటూ. బయటికి వసుధార ఈ డ్రస్సు నీకు నచ్చవు అని అనుకున్నాను. కానీ నీ మొహం చూస్తే, మాటలు చూస్తే ఇవి నచ్చినట్టే ఉన్నాయి, అని అంటుంది. అప్పుడు వసుధార, రిషి సార్ ఇది డీపీఎస్ టి కాలేజ్ మంచి కోసం ఆలోచించి తెచ్చారు. నేనెందుకు కాదంటాను, నేను కాదంటాను అని ఆశపడుతున్నావు అనుకుంటా అని అంటుంది వసుధరా. తరువాత థ్యాంక్యూ రిషి సార్ అని, డ్రెస్సెస్ను తీసుకొని వెళుతుంది.

వసుధార బయటికి వెళుతూ మనసులో ఈ సాక్షి రావడంవల్ల తీసుకోవలసి వచ్చింది అని అనుకుంటూ వెళుతుంది. అప్పుడు రిషి మనసులో ఏంటో ఈ వసుధార ఇప్పటివరకు తీసుకోనని చెప్పి, ఇప్పుడు థ్యాంక్స్ చెప్పి వెళుతుంది అని అనుకుంటూ ఉంటాడు.తర్వాత మహేంద్ర , జగతిలు ఆడ్రస్సునే చూస్తూ ఉంటారు. అప్పుడు వసుధార జగతి తో అసలు ఏంటి మేడమ్ మీ అబ్బాయి నాకు డ్రెస్సులు ఇవ్వడం ఏంటి అని అంటుంది. అప్పుడు జగతి, మహేంద్రతో మన అబ్బాయి అంటూ సైగ చేస్తూ, మహేంద్ర అర్థమైందా కాలేజ్ ఎండీ గారు కాదు మన అబ్బాయి అని ఇద్దరూ సైగలు చేసుకుంటూ ఉంటారు.

Guppedantha Manasu 19th July Today Episode

అప్పుడప్పుడు మన అబ్బాయి, ఒక్కొక్క సారి ఎండీ గారు అని మహేంద్ర అంటాడు. అప్పుడు వసుధార మేడం నేను చాలా హర్ట్ అయ్యాను. మీరేమో ఈజీగా తీసుకుంటున్నారు అని అంటుంది. అప్పుడు జగతి లేదు వసు నేను సీరియస్గానే తీసుకుంటున్నాను. వసు ఇప్పుడు రిషి నీకు ఈ డ్రస్కి కొనిచ్చాడు, నీకు కోపం వచ్చింది అంతే కదా అని జగతి అంటుంది. అప్పుడు అవును మేడం ఒకమ్మాయికి డ్రెస్సెస్ కొన్ని ఇస్తే ఏంటి మేడమ్ అర్థం అని అంటుంది. అంటే నాకు డ్రెస్సులు లేవనా, ఉంటే బాలేవనా, బాలేకుంటే నేనే ఈమాత్రం కొనుక్కోలేను నా, అస్సలు రిషి సార్ నాకు డ్రెస్సెస్ ఎందుకు కొనిచ్చినట్లు మేడం అని అంటే.

Guppedantha Manasu 19th July Today Episode : రిషి ఇచ్చిన డ్రెస్సెస్ను తీసుకున్న వసుధార వాటిని తిరిగి ఇస్తుందా లేదా

అప్పుడు జగతి ఎక్కడో వర్షం పడితే ఇక్కడొచ్చి అడగడం ఏంటి అని, ఒకరి తర్వాత ఒకరు ఈ విషయం గురించి మాట్లాడుతూ ఉంటారు ముగ్గురు.అప్పుడు జగతి రిషి ఏది చేసినా దానికి ఒక కారణం ఉంటుంది అని అంటుంది. అప్పుడు వసుధార అయితే సాక్షి అన్నమాటలకే రిషి సార్ ఇలా చేశారా అని మనసులో అనుకుంటూ ఉంటుంది, థ్యాంక్యూ సార్ అని అంటుంది. వాళ్లు మాట్లాడుకోవడం చూసిన రిషి ఏంటి డ్రెస్సెస్ తిరిగి ఇస్తుందా ఏంటి, ఆత్మాభిమానం ఎక్కువ కదా అని మనసులో అనుకుంటూ ఉంటాడు. తర్వాత రిషి తన మనసు లో ఖచ్చితంగా డ్రెస్సెస్ను వెనుకకు తిరిగి ఇచ్చేసి ఉంటుంది.

సాక్షి ముoదు గౌరవం ఎక్కడ తగ్గిపోతుందో అని సాక్షి ముందే తీసుకుని, అక్కడ తిరిగి ఇచ్చేసిoదా అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో వసుధార మే ఐ కమిన్ సార్ అని, రిషి ఇచ్చిన డ్రెస్ వేసుకొని వస్తుంది. అప్పుడు రిషి వసుధారని అలానే చూస్తూ ఉంటాడు.వసుధారని ఎలా అర్థం చేసుకోవాలి, నేను తనని తప్పుగా అర్థం చేసుకుంటున్నానా అని అనుకుంటూ ఉంటాడు మనసులో. అప్పుడు సాక్షి మనస్సులో కావాలని మీటింగ్ రోజే రిషి ఇచ్చిన డ్రస్ వేసుకుని రావడం ఏంటి అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో మహేంద్ర మీటింగ్ మొదలుపెడదామా అని అంటాడు.

అప్పుడు వసుధార డీబీఎస్ టి కాలేజ్ గురించి ఉన్న మంచి పేరు, బయట వాళ్లు ఎలా మాట్లాడుకుంటున్నారో చెప్పి, ప్లాన్ గురించి ఎక్స్ ప్లెయిన్ చేస్తుంది. అప్పుడు అందరూ క్లాప్స్ కొడతారో వసుంధారకి. రిషి కూడా వెరీగుడ్ వసుధార ఈ ఐడియా బాగుంది అని మెచ్చుకుంటాడు. అప్పుడు వసుధార థ్యాంక్యూ సార్ అని అంటుంది.మేడం యాక్టివ్గా ఉన్న వాళ్లని మొదటి మూడు టీం లీడర్స్ గా డిసైడ్ చేశాను అని మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు సాక్షి దీనిలో గొప్ప తెలివితేటలు ఏమున్నాయి. ఈ మాత్రం నేను కూడా చేయగలను కదా అని అంటుంది.

అప్పుడు రిషి, సాక్షి అనుకోవడం వేరు చేయడం వేరు అని అంటాడు. రిషి టీమ్లో రిషికి అసిస్టెంటుగా ఉండు నేను హెల్ప్ చేస్తాను అని సాక్షి అంటుంది. రిషి నీకు ఓకే కదా అని అంటుంది. అప్పుడు రిషి ఓకే సాక్షి నువ్వు నాకు అసిస్టెంటుగా ఉండు అని అంటాడు. అప్పుడు వసుధార సార్ మరి నేను అని అనడంతో, ఎవరు ఏమి చెయ్యాలో నాకు బాగా తెలుసు వసుధార అని ఈ మీటింగ్ ఓవర్ అని అంటాడు, ఇదంతా వసుధార ఊహించుకుంటుంది. కానీ రిషి అలా ఏమీ అనడు సమాధానం చెప్పకుండా ఈ మీటింగ్ తర్వాత కంటిన్యూ చేద్దాం అని చెబుతాడు.

తర్వాత సాక్షి రిషితో రిషి ని టీమ్ లొ నీకు అసిస్టెంట్ గా ఉంటాను అని ఉంటుంది. అప్పుడు రిషి సర్వీస్ చేయాలనుకున్నవు నీ ప్లేస్ ఏది కరెక్టొ నేను చెప్పాను కదా ఇందాకే అందరిముందు అని అంటాడు. దాంతో సాక్షి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తరువాత రిషి వసుధార తెచ్చిన బొకేని చూస్తూ ఉంటాడు. తర్వాత వసుధార, రిషి ఒకరి కొకరు థ్యాంక్స్ చెప్పుకుంటూ వుంటారు, థ్యాంక్యూ ఎందుకు చెప్పారు సార్ అని అనడంతో, నువ్వెందుకు చెప్పావు అని అడుగుతాడు. అప్పుడు వసుధార డ్రెస్సెస్నిచ్చినందుకు థ్యాంక్యూ సార్ అని అంటుంది. మరి మీరు ఎందుకు చెప్పారు సార్ ఈ డ్రెస్ యాక్సెప్ట్ చేసినందుకా అని అంటుంది. సార్ ఈ డ్రెస్ లు ఎందుకు ఇవ్వాలి అనిపించింది మీకు అని అంటుంది.

అప్పుడు అన్నిటికి కారణాలు చెప్పాలా అని అంటాడు రిషి. నేను ఒకటి అనుకున్నాను సార్ అది అవునో కాదో అని అడుగుతున్నాను. అంటే ఖచ్చితంగా నువ్వనుకున్నది తప్పే ఎదుటివాళ్ళను అంచనా వేయడంలో తప్పే కదా అని అంటాడు. అయినా ఈ డ్రెస్స్ తిరిగిద్దాం అనుకున్నట్టునావు కదా నేను దూరం నుండి చూశాను అని అంటాడు రిషి. అప్పుడు వసుధార దూరంనుంచి చూసినవి నిజం కాదు సార్ దగ్గరి నుంచి చూసినవి నిజం అని అంటోంది. ఇదంతా జగతి మహీంద్రాలు చూస్తూ ఏం జరుగుతుందో అని అంటూ దగ్గరికి వస్తారు వాళ్ళు రాగానే రిషి టాపిక్ మారుస్తాడు. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago