Categories: entertainmentNews

Allu Arjun : అతను లేకపోతే నేనులేను…ప్రాణం ఉన్నంతవరకు రుణపడి ఉంటా…అల్లు అర్జున్…

Allu Arjun  : గంగోత్రి సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సాధించి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. అయితే ఇటీవల అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాతో ఓవర్ నైట్ లోనే అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అంతేకాక ఇంతవరకు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఏ స్టార్ అందుకోలేని బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నటనకు అందరూ ఫిదా అయ్యారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకుగాను ఉత్తమ నటుడిగా అవార్డును పొంది ఇటీవల రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముచేతుల మీదుగా అవార్డును స్వీకరించాడు . భారత రాజధాని ఢిల్లీలో అల్లు అర్జున్ ఈ అరుదైన గౌరవం దక్కించుకున్నాడు. అలాగే పుష్ప సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసిన దేవిశ్రీప్రసాద్ కు కూడా బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు లభించింది.

ఈ క్రమంలో అవార్డు తీసుకున్నందుకుగాను పుష్ప మూవీ టీం సెలబ్రేటింగ్ నేషనల్ అవార్డ్స్ అనే ఈవెంట్ ఏర్పాటు చేయడం జరిగింది.ఇక ఇవి ఈవెంట్ లో భాగంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ.. లైఫ్ లో నేను ఒక లెవెల్ కి వచ్చిన తర్వాత ఒక మైల్ స్టోన్ కు చేరుకున్నప్పుడు ఒక విషయం తెలుసుకున్నాను. అది అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. నేషనల్ అవార్డు దక్కిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే…దీనిలో నేను కష్టపడి చేస్తుంది 50% మాత్రమే మిగతాదంతా మన చుట్టూ ఉన్నవాళ్లు అభిమానులు మా వెంట ఉండి మిగతాది పూర్తి చేశారు. వారంతా కోరుకున్నారు కాబట్టి నాకు నేషనల్ అవార్డు దక్కింది. అయితే నాకు కూడా నేషనల్ అవార్డు రావాలని కోరిక ఉండేది కానీ నాకంటే ఎక్కువ సుకుమార్ కి ఉండేది. అనుకున్నట్టే నాకైతే వచ్చింది కానీ నిజానికి ఆ అవార్డు సుకుమార్ కే వచ్చింది అంటూ అల్లు అర్జున్ ఎమోషనల్ అయ్యారు.

ప్రస్తుతానికి సుకుమార్ ఇక్కడ లేరు కానీ ఇక్కడ ఉన్నట్లే.ఈ సందర్భంగా ఒక విషయాన్ని నేను షేర్ చేసుకోవాలి అనుకుంటున్నా. ఒక సీన్ షూట్ చేసిన తర్వాత సెకండ్ షెడ్యూల్ కోసం మళ్లీ మారేడుమల్లికి వెళ్లి అదే సీన్ మళ్ళీ షూట్ చేసాం. థర్డ్ షెడ్యూల్ అప్పుడు కూడా మళ్లీ అక్కడికే వెళ్దామని చెప్పాడు. అప్పుడు నేను అడిగాను ఆల్రెడీ రెండుసార్లు చేసాం కదా మళ్ళీ మూడోసారి ఎందుకు? దానికి ఆయన ఇచ్చిన జవాబు ఈ సినిమా నాకు ఎంత పేరు తెచ్చి పెడుతుంది …డైరెక్టర్ గా నాకు ఎంత గుర్తింపు వస్తుందనేది నాకు అనవసరం…ఈ సినిమా పైన నీకు ఎంత పర్ఫామెన్స్ వస్తుందనేదే నాకు ముఖ్యం అది ఒకటి తప్ప నాకు ఇంకేం వద్దు అంటూ సుకుమార్ చెప్పారట. ఆయన మాటలు విన్న అల్లు అర్జున్ కు ఏం చేయాలో అర్థం కాలేదట. ఈ క్రమంలోనే ఈ ఘనత సాధించడానికి ముఖ్య కారణం సుకుమార్ అంటూ బన్నీ చెప్పుకొచ్చారు.

jeevan s

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago