if-there-is-no-shooting-rashmika-would-go-to-devarakondas-house
Rashmika Mandanna : నేషనల్ క్రష్ గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత భాషతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలలో నటిస్తూ రష్మిక కెరియర్ పరంగా దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా రష్మిక నటించిన యానిమల్ సినిమా విడుదలకు సిద్ధమైంది. బాలీవుడ్ నటుడు రన్ బీర్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించారు.
ఈ సినిమా డిసెంబర్ ఒకటిన విడుదలసేందుకు సినీ బృందం సన్నాహాలు చేపట్టింది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున మూవీ ప్రమోషన్స్ కూడా నిర్వహిస్తున్నారు. అయితే మూవీ ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా సినీ బృందం బాలకృష్ణ హొస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో కి హాజరవడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి తాజాగా ఎపిసోడ్ ప్రసారం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సందీప్ రెడ్డి తో పాటు రష్మిక మందనం మరియు రన్బీర్ కపూర్ కూడా విచ్చేశారు.
ఈ కార్యక్రమంలో ముచ్చట్లాడుతూ బాలకృష్ణ సందీప్ రెడ్డి ని ప్రశ్నిస్తూ…షూటింగ్ లేని సమయంలో రష్మికను కలవాలంటేే ఎక్కడ కలవాలి అని ప్రశ్నించాడు. ఇక ఈ ప్రశ్నకు సందీప్ రెడ్డి మరియు రన్బీర్ కపూర్ ఇద్దరు కూడా ఒకటే సమాధానం చెప్పారు. రష్మికకు సినిమా షూటింగ్ లేకపోతే ఆమె జిమ్ లో ఎక్కువగా ఉంటుందంటూ చెప్పుకొచ్చారు. అక్కడికి వెళ్తే మనం తప్పకుండా ఆమెను కలవచ్చు అంటూ సమాధానం చెప్పారు. అయితే ఈ వీడియో చూసిన నేటిజనులు చాలా మంది రష్మిక కు షూటింగ్ లేకపోతే విజయ్ దేవరకొండ ఇంట్లో ఉంటుందంటూ కామెంట్స్ చేశారు.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…