Categories: entertainmentNews

Intinti Gruhalakshmi 25th July Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 25-july-2022 ఎపిసోడ్ ముందుగా మీ కోసం….. తులసి మ్యూజిక్ స్కూల్ ఐడియాని ఓకే చేసిన సామ్రాట్, షాక్ లో లాస్య, నందు.

Intinti Gruhalakshmi 25th July Today Episode : (693 episode )సామ్రాట్ ఆఫీసులో చాలామంది ఇంటర్వ్యూకి వస్తూ ఉంటారు. వాళ్లని చూసిన లాస్య, నందుతో ఇంతమంది వచ్చారు, ఇంతమందికి ఇంటర్వూ చేయడం చాలా కష్టం కదా అని అనుకుంటూ ఉంటారు. సరే పద త్వరగా చేద్దాము అని నందు అంటాడు. ఇద్దరూ లోపలికి వెళతారు, ఇంటర్వ్యూ స్టార్ట్ చేయడానికి. తరవాత సామ్రాట్ వాళ్ల బాబాయ్, సామ్రాట్ దగ్గరికి వచ్చి, ఏమో అనుకున్నాను కానీ నీ ఐడియా క్లిక్ అయ్యేలా గా ఉందిరా, బయట చాలామంది ఇంటర్వ్యూకి వచ్చారు అని అంటాడు.

అప్పుడు సామ్రాట్ ఏదైనా తను గ్రేట్ బాబాయ్ అని అంటూ ఉంటాడు. ఎవరి గురించి అని అడగగానే, తులసి గురించి అని తన గురించి గొప్పగా మాట్లాడుతూ ఉంటాడు సామ్రాట్. తులసి స్థానంలో వేరే ఎవరు ఉన్నా కూడా చెక్ ప్లేస్లో చాలా సున్నాలు పెట్టుకునేవాళ్లు, కానీ అలా చేయలేదు, తులసి లాంటి క్యారెక్టర్ ని ఫస్ట్ టైమ్ చూస్తున్నాను అని, తన గురించి పాజిటివ్ గా మాట్లాడతాడు. వాళ్ల బాబాయ్ ఆశ్చర్యపోతాడు మొదటిసారి ఒక మహిళ గురించి ఇంత గొప్పగా మాట్లాడుతున్నావు అని, అప్పుడు సామ్రాట్ ఎలాగైనా తన రుణం తీర్చుకోవాలి అని అంటూ ఉంటాడు.

Intinti Gruhalakshmi 25th July Today Episode

నందు, లాస్య ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. అప్పుడు అక్కడికి తులసి కూడా వస్తుంది. తనని చూసి ఏంటీ ఇక్కడికి వచ్చింది అని లాస్య అంటుంది. అప్పుడు లాస్య తో , తులసి వంట చేసుకునే ఆవిడ తనకేం ఐడియాస్ ఉంటాయి, పద ఫస్ట్ వెళదాం తన దగ్గరికి అని ఇద్దరూ వెళతారు. వాళ్లను చూసి ఆశ్చర్యపోతుంది తులసి.తులసి దగ్గరికి వెళ్లి వెటకారంగా మాట్లాడుతూ, ఇక్కడికి ఎవ్వరు వచ్చినా ముందు నందూనే కలవాలి అని లాస్య అంటోంది తులసితో. ఇంతలో నందు, లాస్య ని సామ్రాట్ పిలవమని చెబుతాడు.

Intinti Gruhalakshmi 25th July Today Episode : తులసి మ్యూజిక్ స్కూల్ ఐడియాని ఓకే చేసిన సామ్రాట్, షాక్ లో లాస్య, నందు.

లాస్య వెటకారంగా మాట్లాడుతూ ఉంటే, నాకొక అవకాశం ఇస్తే నా ఆలోచన ఏంటో చెబుతాను అని తులసి అంటుంది, కానీ లాస్య మాత్రం వెటకారంగానే మాట్లాడుతుంది, చాలామంది వచ్చారు వెళ్లి కూర్చోవాలని, ఇంతలో నందు వాళ్ళని పిలుస్తారు సామ్రాట్, రెస్పాన్స్ ఏంటి అని అడుగుతారు, ప్రతివాళ్ళూ చాలా మెచ్చుకున్నారు సార్ మీ ఐడియా ని అని, చాలామంది వచ్చారు అని లాస్య అంటుంది. ఒకవైపు సామ్రాట్ వాళ్ల బాబాయ్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. తులసి ని చూసి ఏంటమ్మా నువ్వు ఇక్కడున్నావు, నీకు ఇంటర్వ్యూ అవసరం లేదు మా వాడి దగ్గరికి తీసుకెళతాను అని అంటాడు.

సామ్రాట్ వాళ్ల బాబాయ్, తులసిని సామ్రాట్ దగ్గరికి తీసుకొని వెళతాడు, మన యాడ్ చూసి వచ్చింది అని చెబుతాడు.అప్పుడు సామ్రాట్ కూర్చోండి తులసి అని అంటాడు, తులసి కూర్చుంటుంది. అప్పుడు తులసి ముందే నందుని ఏంటి ప్రపోజల్స్ అని అడుగుతూ ఉంటాడు, అప్పుడు ఒక ఐడియా ని చెబుతూ ఉంటాడు. ఇది చాలా రొటీన్ గా ఉంది కొత్తగా ట్రై చేయి నందు అని చెబుతాడు సామ్రాట్. ఇంతలో తులసి గారూ మీరు ఏమి అనుకొంటున్నారు అని అడగగానే, తులసి సంగీతం గురించి చెబుతుంది. ఒకవైపు నందు, లాస్య ఏంటి దీని వల్ల ఉపయోగం అని అంటూ ఉంటారు.

అప్పుడు తులసి సంగీతం గొప్పతనం గురించి మాట్లాడుతూ ఉంటుంది. సంగీతం నేర్చుకోవడం వల్ల ఏకాగ్రత కూడా పెరుగుతుంది అని చాలా గొప్పగా మాట్లాడుతోంది, దాంతో సామ్రాట్ చప్పట్లు కొడుతూ నాకు కావలసింది ఇలాంటి ప్రపోజలే చాలా బాగుంది అని తులసిని మెచ్చుకుంటాడు. వెంటనే మొదలు పెట్టండి అని చెపుతూ వుంటాడు నందు కి, తులసి నా కల నెరవేరేలా గా చేస్తున్నారు థ్యాంక్స్ అని చెబుతుంది. అప్పుడు సామ్రాట్ మనసులో దేవుడా నా కళ నెరవేర్చావు అని అనుకుంటూ ఉంటాడు.

తులసి ఇంటికి వెళ్లి తన ఐడియా ఓకే చేశారు అని చెబుతోంది, సంతోషంతో ఫ్యామిలీ అందరూ, తనకి అభినందనలు చెప్తారు, ఇలా ఆనందంగా ఉంటారు, అంకిత ఈరోజు మనం పండగ చేసుకుందాం ఆంటీ అని అనేలోపు, అక్కడికి అభి కూడా వచ్చి నేను కూడా ఈ పండగలో భాగం కావొచ్చ అని అడుగుతాడు. అప్పుడు అందరూ సంతోషపడతారు అభి, అంకిత దగ్గరికి వచ్చి, నేను ఇక్కడే ఉండిపోడానికి వచ్చాను అంకిత నీ కోసం, నేను నీ నుంచి దూరంగా ఉండలేను నా ప్రేమను నిరూపించుకోవడానికి వచ్చాను అని అంటాడు. దాంతో కుటుంబం అందరూ నువ్వు ఇక్కడే వుంటే మాకందరికీ సంతోషం అని అంటారు. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago