Intinti Gruhalakshmi 27 September Today Episode
Intinti Gruhalakshmi 27 September Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 27-September-2022 ఎపిసోడ్ 748 ముందుగా మీ కోసం. సామ్రాట్ హాని దగ్గరికి వెళ్లి బాధపడుతూ ఉంటాడు, నీలో చెల్లి ప్రేమను చూసుకుంటున్నాను అని మనసులో అనుకొంటూ వెళ్లిపోయేలోపు, సామ్రాట్ చేయిని హని పట్టుకుంటుoది, ఇంకా పడుకోలేదా అని సామ్రాట్ అడగ్గానే, లేదు నాన్న మా నాన్న ఎప్పుడూ హీరోనే, కానీ ఈ రోజు ఒకరి దగ్గర తలదించుకున్నాడు నువ్వెందుకు మా అమ్మ గురించి అడిగినప్పుడు సమాధానం చెప్పలేదు అని అనడంతో, సామ్రాట్ సమాధానం చెప్పడు, సరే నాన్న నీకు చెప్పాలనిపించినప్పుడు చెప్పు అని పడుకుంటుంది. తర్వాత సామ్రాట్ బయటికి వెళ్లి ఒక్కడే కూర్చుని బాధపడుతూ ఉంటాడు, అక్కడికి సామ్రాట్ వాళ్ల బాబాయి వచ్చి నువ్వు స్వార్థపరుడివి, అసమర్ధుడివి అని తిడుతూ ఉంటాడు. నువ్వు తులసి నీ అన్నిమాటలంటుంటే ఒక్క మాట కూడా మాట్లాడ లేదు తులసి ధైర్యంగా మాట్లాడింది కాబట్టి సరిపోయింది, లేకపోతే పరిస్థితి ఏంటి నీ వల్ల అన్ని మాటలు పడాల్సి వచ్చింది.
అని అనడంతో, నిజం తెలిసిన నువ్వు కూడా ఇలానే మాట్లాడితే ఎలా బాబాయ్ ఒక నిజాన్ని దాచి పెట్టడం కోసం, ఒక పసి ప్రాణానికి ఇబ్బంది కలగకూడదనే ఇదంతా కదా నీకు తెలుసు కదా అని అంటాడు, అప్పుడు వాళ్ల బాబాయ్ ఏమో నాకు తెలిసి తులసి నిన్ను నమ్మదు అని అనిపిస్తుంది అనడంతో, తులసి గారు అలా చేయరు అని సామ్రాట్ అంటాడు, ఇలా కొద్దిసేపు వీళ్లు మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత అభి నిద్ర పట్టక బయటికి వస్తాడు హాల్లో కూర్చుంటాడు, జరిగిన విషయం ఆలోచిస్తూ ఉంటాడు, అక్కడికి లాస్య నందు వస్తారు, లాస్య ఇలా అంటుంది నీకు కూడా నిద్ర పట్టడం లేదా అని మాకు పట్టడం లేదు, నిజానికి మాటలు పడ్డవాళ్లు బానే ఉన్నారు కానీ మనకి మాత్రం నిద్ర రావడం లేదు అని లాస్య అంటోంది. తరువాత నందు ఇప్పట్నుంచి నాకు దూరంగా ఉండు, నాకు దగ్గరగా ఉన్న అందుకే నిన్ను ఇంట్లో వాళ్లు దూరం పెడుతున్నారు అని అభితో అంటాడు.
తరువాత లాస్య ఇలా అంటూ ఉంటుంది అన్ని మాటలు అంటుంటే ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేదు అలాంటివాణ్ని నమ్మి మిమ్మల్నందర్నీ ఇక్కడికి తీసుకొచ్చింది అని తప్పుగా మాట్లాడుతుంది, ఇలా మాట్లాడుతూ అభిని రెచ్చగొట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తెల్లవారాక తులసి వాళ్లు బయలుదేరుతూంటారు వాళ్ళ ఇంటికి సామ్రాట్ గారికి బయలుదేరుతున్నాం అని చెపుతూ ఉంటుంది, దాంతో హనీ అప్పుడే వెళ్లిపోతున్నారా ఆంటీ అని అంటోంది, నువ్వు బాధపడొద్దమ్మా, సంతోషంగా బాయ్ చెప్పు మళ్ళీ వస్తాను కదా అని అనడంతో, సామ్రాట్గారూ సరేనండీ ఆఫీసులో కలుద్దాం నేను కూడా ఈ రోజు నుంచి ఆఫీసుకి వస్తాను అని చెప్తాడు, అప్పుడు అభి ఇక నుంచి మా అమ్మ ఆఫీస్కి రాదు అసలు మీరు సమాధానం ఎందుకు చెప్పకుండా మౌనంగా ఉన్నారు అని సామ్రాట్ని నిలదీస్తాడు. ప్రెస్ వాళ్లు అన్ని మాటలు అంటుంటే, ఒక్కదానికి కూడా సమాధానం చెప్పే ధైర్యం లేదు అని అనగానే, సామ్రాట్ వల్లభాబాయ్ నీకేం తెలుసని మాట్లాడుతున్నావ్ అని అంటాడు.
తులసి వల్ల మామయ్య కూడా అభిని ఆపటానికి ప్రయత్నిస్తాడు నువ్వు సారీ చెప్పు సామ్రాట్ గారికి అనగానే, నేను సారీ చెప్పాలంటే మౌనంగా ఎందుకు ఉన్నాడో, కారణమేంటో ఇప్పుడు చెప్పమను అని అభి అంటాడు. మౌనంగా ఉన్నంత మాత్రానా తప్పు చేసినట్టు కాదు, కొన్ని చెప్పలేను అని సామ్రాట్ అనగానే, అసలు ముసుగులో గుద్దులాట ఆపి మీ భార్య గురించి నిజం ఏంటో చెప్పండి, మీ భార్య లేచిపోయిందా, వదిలేశారా, చంపేశారా అని ప్రశ్నిస్తాడు, దాంతో సామ్రాట్ వాళ్ల బాబాయ్ అభి కాలర్ పట్టుకొని అంటాడు, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా అని, ఇప్పుడు సహనంగా ఉంటే ప్రయోజనం లేదు, నిజం ఏంటో తెలిస్తే అప్పుడే నీ కాళ్ల మీద పడతాడు అభి అని సామ్రాట్ వాళ్ల బాబాయ్ అంటాడు. సామ్రాట్ వాళ్ళ బాబాయి ఆవేశంగా మాట్లాడుతూ, నిజాన్ని చెప్పేస్తాడు, హనీ సామ్రాట్ వాళ్ళ చెల్లెలి కూతురు, తన జీవితాన్ని పాప కోసం త్యాగం చేశాడని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. ఈ విషయాన్ని అందరి ముందు చెప్పలేక, మౌనంగా ఉన్నాడు అని చెపుతూ వుంటాడు. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…