Intinti Gruhalakshmi 30 July Today Episode 698
Intinti Gruhalakshmi 30 July Today Episode 698 : ఎపిసోడ్ 698 ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 30-July-2022 ఎపిసోడ్ ముందుగా మీ కోసంకాంపిటీషన్ లో విన్ అయిన లక్కి, హనీలకు ఫ్రైజ్ ఇస్తారు ప్రిన్సిపాల్ గారు. తర్వాత ఫొటోస్ తీసే అతడు ఫొటోస్ తీస్తూ ఉంటాడు. లక్కి, లాస్య, నందులని కలిపి ఒక ఫొటో తీశాడు. తర్వాత హనీ, సామ్రాట్, తులసిలను ఫోటో తియ్యబోతుంటే తులసి పక్కకి జరుగుతుంది, అప్పుడు హనీ పాప తులసి చేయి పట్టుకుంటోంది, దాంతో ముగ్గురు ఫోటో దిగుతారు. అది చూసిన లాస్య, నందుతో చూడు ఒకప్పుడు నీ పక్కన కుదురుగా ఉండేది .
ఇప్పుడు హనీ వాళ్ళ అమ్మ స్థానంలో ఉంది చూడు తులసి అని అంటూ ఉంటుంది. తులసి, లక్కి దగ్గరికి వెళ్లి కంగ్రాట్స్ చెప్తుంది. తర్వాత హని ఫ్రైజ్ చూసి చాలా సంతోషపడుతుంది. వాళ్ల తాతయ్య ఫోటోలు తీస్తూ ఉంటాడు. ఒకవైపు సామ్రాట్, తులసి గురించి ఆలోచిస్తూ ఉంటాడు నవ్వుకుంటూ, అది గమనించిన వాళ్ల బాబాయ్, తన దగ్గరికి వెళతాడు. సామ్రాట్ వాళ్ల బాబాయ్ తో నా హనీ ముఖంలో ఇంతకు ముందుకు సంతోషం కనిపించేది, కానీ ఇప్పుడు జీవం ఉట్టిపడేలా సంతోషాన్ని చూస్తున్నాను దానికి కారణం తులసీ అని అంటూ ఉంటారు.
ఇలా కొద్దిసేపు వాళ్లు తులసి, హనీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. దీనంతటికి కారణం తులసి అని అనుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ల బాబాయ్ హని మాత్రమే కాదు, నువ్వు కూడా మారావు, ఇన్నిరోజులు పెళ్లి చేసుకోమంటే చేసుకోలేదు, ఇప్పుడైనా పెళ్లి గురించి ఆలోచించు అనగానే, ఈ వయసులో పెళ్లి ఏంటి బాబాయ్ అని అనుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు వాళ్ల బాబాయ్ నువ్వు ఖచ్చితంగా మారతావు అని నా నమ్మకం అని అంటాడు.తరువాత తులసి వాళ్ల ఇంట్లో అందరూ సరదాగా టిఫిన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి లాస్య, నందు వస్తారు. వీళ్లు ఇక్కడికొచ్చారు ఏంటి అని, తులసి వాళ్ళ అత్తామామలు అనగానే, లేదు మామయ్యా వాళ్ళు ఇప్పుడు బిజినెస్ పనిమీద వచ్చారు, ఇక్కడికి అని అంటోంది తులసి.
మ్యూజిక్ స్కూల్ పనిమీద ఇక్కడికి వచ్చాము అని నందు అంటాడు. అప్పుడు అంకిత, సామ్రాట్గారూ కదా ఇన్వెస్ట్మెంట్ చేసేది, వీళ్లు వచ్చారు ఏంటి అని అనగానే, వాళ్లు సామ్రాట్ గారి దగ్గర పని చేస్తున్నారు అని అంటుంది తులసి. పని వాళ్ళు ఏంటి అని లాస్య అనగానే, లాంగ్వేజ్ ప్రాబ్లం అని నందు అంటాడు. ఇలా కొద్దిసేపు వాళ్లు ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు, గొడవ పడుతూ ఉంటారు. అప్పుడు తులసి, మీకు రావడం ఇష్టం లేకపోతే వెళ్లండి, నష్టం మీకు జరిగేది, సమాధానం చెప్పుకోవాలి సామ్రాట్ గారి దగ్గర, అని అంటూ ఉంటుంది.
దాంతో నందు, తులసితొ ప్లాన్ గురించి చెబుతాను అని అంటూ ఉంటాడు. వాళ్లు ప్లాన్ చెపుతూ ఉంటారు. తులసి వాళ్ళ అత్తమామలు నందు గురించి మాట్లాడుతూ ఉంటారు. ఓడలు బండ్ల అవ్వడం, బండ్లు ఓడలు అవ్వడం, నా కళ్లముందే చూస్తుంటే నవ్వొస్తోంది అని తులసి వాళ్ల అత్త అంటుంది. అప్పుడు వాళ్ళ మామ రోజులన్నీ ఒకెే విధంగా ఉండవు అని మాట్లాడుకుంటూ ఉంటారు.అప్పుడు అభి ఉండి మీరు మాట్లాడేది మీ కొడుకు గురించి అని అంటాడు, ఎంతైనా నన్ను నాన్న పార్టీ అని వీళ్లు అంటూ ఉంటారు. మాకు ఎటువంటి శత్రుత్వం లేదు.
మీ నాన్న ఎన్ని చేసాడో కళ్లారా మేము చూసాము, చదువు లేదు అని తులసిని ఎగతాళి చేశారు, ఎన్నో బాధలు పెట్టాడు, అని కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఉంటారు. ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేశాక, మీకు ఓకేనా తులసి గారూ అని అంటాడు నందు. అప్పుడు తులసి ఓకే కాదు అని అంటోంది. మీరు పర్సనల్ గొడవలు దృష్టిపెట్టుకొని అంటున్నారా అని అంటాడు. పర్సనల్ గురించి కాదు, మీరు ప్లానింగ్ ఎక్స్ ప్లెయిన్ చేశారు అది నాకు నచ్చలేదు, అని ప్లాన్ గురించి మాట్లాడుతూ ఉండగా, ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…