Janaki Kalaganaledu 14th July Today Episode
Janaki Kalaganaledu 14th July Today Episode : జానకి కలగలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు తాజాగా విడుదలైంది. 14 గురువారం ఎపిసోడ్ 344 హైలెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.. జ్ఞానాంబ గోవిందరాజు అందరూ గుడి నుంచి ఇంటికి వచ్చేస్తారు. ఆ తర్వాత జ్ఞానంభ పిల్లలు ఒకసారి పలకరిస్చేస్తానండి. అని చెప్పి వాళ్ళ దగ్గరికి వస్తుంది. రామ జానకి వాళ్ళ గది తలుపులు కొడుతూ ఉంటుంది. జానకి రాములు ఇంకా నిద్ర లేవరు. ఆ తలుపు కొట్టే సౌండ్ కి జానకి మేల్కొంటుంది. రామ గారిని లేపుతుంది. ఎవరో తలుపు కొడుతున్నారని లేవండి లేవండి రామ తను లేచి ఆశ్చర్యపోతూ నేనేంటి ఇలా పడుకున్నాను అని అనుకుంటాడుజానకి అని జానకిని అడుగుతూ ఉంటాడు నేనేంటి అలా అని అంటూ ఆశ్చర్యపోతాడు.
జానకి జ్ఞానాంబ సంతోషపడాలని తను ఫస్ట్ నైట్ జరిగింది.అనుకోవడానికి తను బొట్టుని తుడుచుకొని ఫస్ట్ నైట్ జరిగింది అనుకునేలా కవర్ చేస్తూ బయటికి వస్తుంది. జ్ఞానంబ సంతోషిస్తుంది. మల్లిక చూసి వీళ్ళ ఫస్ట్ నైట్ జరిగిందా? ఐదు సెంట్లు భూమి పోయినట్లే అని బాధపడుతూ ఉంటుంది. చికిత రామ జానకిలను చూసి నవ్వుతుంది. జ్ఞానంబ మల్లిక దగ్గరికి వెళ్తుంది. మల్లిక కూడా ఫస్ట్ నైట్ జరిగింది. అని అనుకోవడానికి కవర్ చేస్తుంది. జ్ఞానాంబ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మల్లిక అత్తయ్య నమ్మేసినట్లుంది. అని తెగ సంబరపడిపోతుంది. రామ ఇంట్లోకి వచ్చి తన బట్టల్ని చూసుకుంటూ లిఫ్టింగ్ తన బట్టలకి ఉండడాన్ని చూసుకుంటూ తెగ బాధ పడిపోతూ ఉంటాడు.
జానకి రామను చూసి తెగ నవ్వుకుంటుంది. రామ నా బట్టల మీదకి ఇవన్నీ ఎందుకు వచ్చాయండి ఎలా వచ్చాయని అడుగుతాడు. జానకి చేయాల్సినంత చేసి మళ్ళీ ఏంటి అని అడుగుతాడని జోక్ చేస్తుంది. జానకి, నాకు అంతా అయోమయంగా ఉందండి నేను మీ కల నెరవేర్చాలి అని అన్నంత వరకు మాత్రమే నాకు గుర్తుంది. మిగతాదంతా నాకు గుర్తులేదు ఇది ఎలా జరిగిందండి అని బాధపడుతూ ఉంటాడు. రామ దాని గురించి ఆలోచించుకుంటూ బాధపడుతూ ఉంటాడు. జానకి ముందు విశ్వామిత్రుల ముక్కు ముస్కుని ఉన్నారు. తర్వాత ఏమో మన్మధుడు మీ ఒంట్లోకి వచ్చినట్టున్నారు. అని ఆటపట్టిస్తుంది. రామ తెగ భయపడి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.
తరువాత జ్ఞానంబ పాయసం రెడీ చేసి అందర్నీ పిలుస్తుంది. రామ కోపంగా ఉంటాడు జానకి ఎందుకండీ అంత కోపం అని కొంచెం సంతోషంగా ఉండండి. అని చెప్తుంది. జానకి ఇంకా రామని ఆట పట్టిస్తూనే ఉంటుంది. జ్ఞానంబ పిలుస్తూ ఉంటుంది. మల్లికా మాత్రం జ్ఞానాంబ పిలిచిన వెళ్లదు. విష్ణు మల్లిక అమ్మ పిలుస్తుందే అంటే ఆవిడ పిలిస్తే నేనెలాల అని ఎటకారంగా మాట్లాడుతుంది. తర్వాత మల్లిక అని గట్టిగా పిలుస్తుంది జ్ఞానాంబ ఉల్లికి పడిలేసి వస్తుంది మల్లిక, మల్లిక జ్ఞానాంబ దగ్గరికి సిగ్గుపడుతూ వస్తుంది. ఏంటమ్మా అని రామ ఆడుగుతాడు జ్ఞానంబ ఆగు అన్నయ్య వాళ్ళు కూడా వస్తున్నారు అని అంటుంది. జ్ఞానాంబ మల్లికను నువ్వేంటి గదిలోంచి రావడానికి ఇంత టైం పడుతుంది.
అంటే మల్లికా తెగ హోయలు పోతూ డ్రామాలు చేస్తుంది.అంటే ఫస్ట్ నైట్ జరిగినట్లుగా అనుకోవాలని, జ్ఞానాంబ ఇక చాలు ఆపు అంటుంది. జ్ఞానంబా రామ కు స్వీట్ తినిపిస్తుంటే,ఎందుకమ్మా ఇవన్నీ ఇప్పుడు అంటాడు. జ్ఞానాంబ ఇన్నాళ్లు నేను ఎంతో బాధపడ్డాను ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఏంటి వారసుల కోసం ఎంతో ఎదురు చూశాను. నా కోడలు ఇద్దరు నాకు మాట ఇచ్చిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది. అని జానకి రామకి స్వీట్ తినిపిస్తుంది. అలాగే మల్లికాకి కూడా పెట్టాదానికి చూస్తుంటే తనకు హోయలు పోతూ సిగ్గుపడుతూ ఉంటుంది. విష్ణు కి అప్పుడు అర్థమవుతుంది. తను డ్రామా చేస్తుంది అని, విష్ణు వాళ్ళ అమ్మకి జరిగినదిచెప్పాలని అనుకుంటాడు.
కానీ మల్లిక విష్ణుకాళి తొక్కి కవర్ చేస్తుంది. జ్ఞానాంబ ఇద్దరి జంటలను చూసి చాలా సంతోషపడుతుంది. రామ నా భార్య ఐపీఎస్ కలను నెరవేర్చాలి నేను అనుకుంటుంటే మీరేమో అమ్మకి ఇచ్చిన మాట నెరవేర్చాలని తపన పడుతున్నారు. ఈ పరిస్థితులు మీ చదువుకి ఎక్కడ ఆటంకాలు కలు గిస్తుందో అని నాకు భయమేస్తుంది. మనసులో అనుకుంటూ షాప్ కి వెళ్తారు. అలాగే విష్ణు కూడా వెళ్తాడు. మల్లిక అత్తయ్యని బానే కవర్ చేశాను. కానీ ముందు నేను పిల్లలకనాలని అనుకుంటూ ఉంటుంది. రామ వెళ్ళిపోతుంటే జానకి బయటికి వచ్చి బాధపడుతూ ఉంటుంది. జ్ఞానంబ దేవుడు దగ్గరికి వచ్చి దండం పెడుతూ నేను అనుకున్నది జరగాలి నా ఇంట్లో వారసులు పుట్టాలి.
నేను నీ కొండకి వస్తానని దండం పెడుతుంది. గోవిందరాజు కూడా వచ్చి దండం పెట్టుకుంటూ ఉంటాడు. జ్ఞానాంబ మనం చేసిన ప్రయత్నాలు ఫలించాయి అండి అని చెప్తుంది గోవిందరాజుకి, కాకపోతే మళ్లీక కంటే ముందు జానకి పిల్లలు కలగాలని అనుకుంటున్నానండి .విష్ణు కంటే ముందు రామనే తండ్రి అవ్వాలని అనుకుంటున్నాను. అండి అని గోవిందరాజుకి చెప్తుంది. గోవిందరాజు అదేంటి అలా అంటావు ఎవరికైతే ముందు పుడితే ఏంటి అని అంటాడు.
జ్ఞానాంబ అది కాదండి పెద్ద కోడలికి ముందు పుడితే బాగుంటుంది. చిన్న కోడలికి పుట్టి పెద్ద కోడలు పుట్టపోతే అందరూ ఏమేమో అనుకుంటారండి. ఆ బాధను భరించటం చాలా కష్టమండి అలాంటి బాధను రామా జానకిలు పడకూడదని అలా చెప్తున్నాను. నేను అనుకున్నది కచ్చితంగా జరుగుతుంది. అండి అని గోవిందరాజు తో చెబుతూ ఉంటుంది. ఇద్దరూ దంపతులు చాలా సంతోషపడుతూ ఉంటారు. అదంతా జానకి చూస్తూ ఉంటుంది. తర్వాతే ఏం జరిగిందో చూడాలనుకుంటే రేపటి ఎపిసోడ్ కోసం ఎదురు చూడాల్సిందే.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…