Categories: entertainmentNews

Karthika Deepam 22 Aug Today Episode : శివ కార్తీక్ ఫోటోని చూసి కూడా నాకు తెలీదు అని ఎందుకన్నాడు…

Karthika Deepam 22 Aug Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ కార్తీకదీపం ఈ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈరోజు ఎపిసోడ్ 1437 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… దీప కార్తీక్ ఫోటోను చూపిస్తూ అందర్నీ తన గురించి అడుగుతూ ఉంటుంది. కార్తీక్ తో వచ్చిన అతన్ని కూడా ఇతన్ని ఎక్కడైనా చూశారా అని అడుగుతుంది. అప్పుడు అతను చూడలేదు అని చెప్తాడు. అప్పుడు దీప ఎవరు తీసుకెళ్లి ఉంటారు. కార్తీక్ బాబుని అని ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడ ఒకరిని అడగ ఇప్పుడే ఇక్కడ జ్యూస్ తాగారు అమ్మ అని చెప్తారు. కానీ దీప ని గమనించి ఆ శివ కార్తీక్ ని తొందరగా వెళ్ళాలి అని తీసుకెళ్తాడు. అప్పుడు దీప అంత వెతికి ఎక్కడున్నారు. దగ్గరగా వచ్చి ఇలా దూరమవుతున్నారు ఎందుకు అని బాధపడుతూ ఉంటుంది. కట్ చేస్తే సౌర్య ని సినిమాకి వెళ్దాం పద అని వాళ్ళ పిన్ని, బాబాయ్ లు అంటారు. అప్పుడు శౌర్య సినిమాకా.. కటింగ్ చేయడాని కా.. అని అంటుంది. అయ్యో అవన్నీ ఎప్పుడూ మానేశావు తల్లి నిజంగా సినిమాకే రా అని అనగానే సరే అని వెళుతూ ఉంటారు.

కట్ చేస్తే దీప ఇంకా తన ఫోటోను చూపిస్తూ వెతుకుతూనే ఉంటుంది. అలాగే అక్కడ కూరగాయలు కొంటూ ఒకపక్క దీప.. ఇంకొకపక్క బట్టలు తీసుకుంటూ శౌర్య. మరోపక్క కార్తీక్ బాబు వస్తూ ఉంటాడు. అప్పుడు కార్తీక్ అక్కడ బిర్యానీ చాలా బాగుంటుంది. సీతాపతి అని అంటాడు. అప్పుడు సార్ నా పేరు సీతాపతి కాదు శివ అని అంటాడు. అక్కడ బిరియా నీ నా వద్దులేండి సార్ అని అంటుండగా.. గట్టిగా ఏం కాదులే పద అని అంటుండగా దీప తన మాటను గుర్తుపట్టి ఏను తిరిగి తన దగ్గరికి వస్తుంది. డాక్టర్ బాబు అని దగ్గరకు వచ్చి అనగానే ఎలా ఉన్నారు అని అనగా కార్తీక్ మీరు ఎవరు అని అడుగుతాడు. అప్పుడు దీప ఏడుస్తూ..డాక్టర్ బాబు నేను దీప ని అని అంటుంది. కార్తీక్ దీప ఎవరు అని అంటాడు. అప్పుడు దీప డాక్టర్ బాబు అసలు మీకు ఏమైంది అని అడుగుతుంది. నేను మీ వంటలక్కని మనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అని చెప్తుంది. సార్ మీరు రండి సార్ ఎవరో పిచ్చిదాని లాగా ఉంది అని శివ అంటాడు.

Karthika Deepam 22 Aug Today Episode : శివ కార్తీక్ ఫోటోని చూసి కూడా నాకు తెలీదు అని ఎందుకన్నాడు…

Karthika Deepam 22 Aug Today Episode

అప్పుడు దీప నిన్ను నేను పొద్దున ఈ ఫోటో చూపించి అడిగాను నాకు తెలియదు అన్నావు . అంటే ఎందుకు ఈ నాటకాలు అని అంటుంది. అప్పుడు కార్తీక్ నీతో మాట్లాడిందా ఆవిడ అని అడుగుతాడు. అవును సార్ ఇలాంటి వాళ్ళు ఇలా డబ్బులు కోసం ఏదో ఒక టెక్నిక్ ని వాడుతూ ఉంటారు మీరు రండి సార్ అని అంటాడు. అప్పుడు దీప ఏడుస్తూ మనిద్దరికీ యాక్సిడెంట్ అయింది. నేను నిన్ను వెతుకుతున్నాను. అసలు మీకు ఏమైంది అని ఏడుస్తుంది. అప్పుడు మీరు ఎవర్నో చూసి ఎవరో అనుకుంటున్నారు. నేను మీరు అనుకున్న మనిషిని కాదండి అని అంటాడు కార్తీక్. శివ వెళ్దాం పదండి. అని కార్తీక్ ని తీసుకెళ్తాడు. అప్పుడు అంతలో దీప కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. కట్ చేస్తే డాక్టర్ వాళ్ళ ఇంట్లో దీప ఏడుస్తూ ఏం జరుగుతుందో ఏంటో అర్థం కావడం లేదు అన్నయ్య అని తనకి చెప్తూ ఉంటుంది. నా డాక్టర్ బాబు నన్ను గుర్తు పట్టడం లేదు ఎందుకిలా జరిగింది అని అడుగుతుంది.

ఇలాంటి ఘోరం చూసే కన్నా ఆ ప్రమాదంలో కళ్ళు మూసిన బావుండు అన్నయ్య అని అంటుంది. అప్పుడు డాక్టర్ ఎందుకమ్మా అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావ్. అసలు నువ్వు చూసింది నీ భర్తనే కదా. అవునన్నయ్య నా భర్తని అని అంటుంది. మరి నిన్ను ఎందుకు గుర్తుపట్టలేదు అమ్మ అని డాక్టర్ అంటాడు. అప్పుడు నేను తన పక్కన ఉన్న అబ్బాయిని డాక్టర్ బాబు ఫోటో చూపించి అడిగితే నాకు తెలియదు అన్నాడు. మళ్లీ రాత్రి వచ్చి తనను తీసుకొని వెళ్ళాడు అంటే ఎవరూ ఏదో చేస్తున్నారని అర్థం అవుతుంది అన్నయ్య. అప్పుడు డాక్టర్ మనిషి బ్రతికే ఉన్నాడు కదా ఇప్పుడు తను నీ భర్త అవునా.. కాదా.. తెలుసుకుందాం అని అంటాడు. ఇది ఊర్లో 15 ఏళ్లుగా ఉంటున్నాను ఎవరేంటి ఎక్కడుంటాడు అన్ని తెలుసుకుందాం నువ్వేం కంగారు పడకు నువ్వు ధైర్యంగా ఉండు అని డాక్టర్ దీపకు చెప్తాడు. సరే అని నేను కాఫీ తీసుకొస్తాను అన్నయ్య అని చెప్పి వెళ్తుంది దీప..

అప్పుడు డాక్టర్ దగ్గరికి ఒకతను వస్తాడు. అప్పుడు వచ్చావా మనం ఒక క్యాంపూ పెడదాం అనుకున్నాం కదా నువ్వు ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వచ్చావు అని అంటాడు. అప్పుడు 21 గ సార్ మీరు రమ్మంది అని అంటారు. అప్పుడు డాక్టర్ ఒకరోజు మింగేసావా ఈరోజు డేట్ ఎంతో చూడు అని క్యాలెండర్ వైపు చూపిస్తాడు. అవును సార్ ఈరోజు 22 నేను చెప్తాను లేను సరేనా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు దీప ఆ క్యాలెండర్ ను చూస్తూ తన పెళ్లిరోజు గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు డాక్టర్ ఏంటమ్మా మళ్లీ ఏడుస్తున్నావ్ ఈరోజు ఏమన్నా స్పెషల్ ఆ అని అడుగుతాడు. అప్పుడు ఈరోజు నా భర్తతో కలిసి సంతోషంగా బతకాల్సిన రోజు కానీ నా భర్త నన్ను గుర్తించడం లేదు అని ఏడుస్తూ ఉంటుంది. తర్వాతే ఏం జరిగిందో తెలియాలి అంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే..

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago