Lavanya tripathi says the reason for not acting in ' bangarraju2' movie
Lavanya tripati : తెలుగులో తొలి సినిమాతో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది ఈ అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి. వరుస సినిమాలతో తనదైన శైలిలో నటిస్తూ అభిమానుల గుండెల్లో నిలిచిపోయింది. పెద్ద హీరోలతో నటిస్తూ తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు కొత్తగా ‘హ్యాపీ బర్త్ డే ‘సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీ టీజర్ అభిమానుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంటుంది. అలాగే ఈ కొత్త సినిమాను రాజమౌళి చేతుల మీదుగా రిలీజ్ చేశారని తెలుస్తుంది. అయితే కొత్త సినిమా ప్రమోషన్స్లో పాల్గొన్న లావణ్య బంగార్రాజు2 సినిమాలో తను నటించక పోవడానికి గల కారణం ఏంటో చెప్పుకొచ్చింది.
నాగార్జున డ్యూయల్ రోల్ లో నటించిన సినిమా ‘ సోగ్గాడే చిన్నినాయన ‘ ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.ఈ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ‘ బంగార్రాజు ‘ మూవీ కూడా అభిమానులను ఎంతగానో అలరించింది. ఈ సినిమా బాక్సాఫీస్ ముందు కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమాలో నాగార్జున యంగ్ రోల్ కు జోడిగా లావణ్య త్రిపాఠి నటించిందని మనందరికీ తెలుసు. అయితే బంగార్రాజు సినిమాలో మాత్రం లావణ్య త్రిపాఠిని తీసేశారు. దీనికి గల కారణం ఏంటో ఈ భామ చెప్పుకొచ్చింది.
బంగార్రాజు సినిమాలో నాగచైతన్యకు అమ్మ పాత్రలో లావణ్య త్రిపాఠి నటిస్తే బాగోదని భావించి చిత్ర బృందం వారు ఆ సినిమాలో ఆమె క్యారెక్టర్ ను చనిపోయినట్లుగా చూపించారు. నాగచైతన్యకు తల్లిగా నటిస్తే అభిమానులకు నచ్చకపోవచ్చు అని చిత్ర యూనిట్ అనుకోని లావణ్య కు చెప్పారట. ఇదే విషయాన్ని నాగ్ సార్ నాకు ఫోన్ చేసి చెప్పారు. ఆయన ఆ మాట చెప్పగానే కాస్త ఊపిరి పీల్చుకున్నాను అని చెప్పింది. ‘యుద్ధం శరణం ‘సినిమాలో చైతన్యకు హీరోయిన్ గా నటించి, మళ్లీ తల్లిగా ఎలా నటిస్తాను అని చెప్పుకొచ్చింది ఈ అందాల రాక్షసి.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…