Netflix is planning big with Rajamouli
Rajamouli : ఎస్.ఎస్. రాజమౌళి పేరు ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు. ఇప్పుడు ఎస్.ఎస్ రాజమౌళి అనేది కేవలం పేరు కాదు అది ఒక బ్రాండ్ గా మారిపోయింది. ఎందుకంటే ‘ బాహుబలి ‘ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తెలుగు సత్తా అంటే ఏంటో తెలియజేశారు. ఈ బాహుబలి సినిమా ఎంతలా హిట్
అయ్యిందో మనందరికీ తెలుసు. ఇప్పటికి చాలామంది బాహుబలి సినిమాను తలుచుకుంటూ ఉంటారు.
ఆఖరికి చిన్న పిల్లలు కూడా బాహుబలి సినిమా అంటే ఎంతగానో ఇష్టపడతారు. చిన్నపిల్లలు బాహుబలి సినిమాలోని కొన్ని డైలాగులను కూడా చెప్పేంతల ఉన్నారు. చిన్న పిల్లల్ని కూడా ఎంతగానో ఆకట్టుకుంది ఈ బాహుబలి సినిమా. ఈ సినిమా క్రెడిట్ అంతా డైరెక్టర్ రాజమౌళిదే.
అలాగే ఈ మధ్యనే వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీ తో తానేంటో నిరూపించుకున్నారు. ఈ సినిమా వేయి కోట్ల బడ్జెట్ తో తీశారు. అంతే ఈ సినిమా కూడా బాక్సిఫీస్ ను బద్దలు కొట్టింది. ఇప్పుడు సినీ డైరెక్టర్స్ లో రాజమౌళికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది.ఆ క్రమంలోనే ఓ ఆసక్తికర వార్త టాలీవుడ్ లో బాగా వైరల్ అవుతుంది. ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ రాజమౌళితో కలిసి పనిచేయాలని అనుకుంటున్నారంట. ఇందులో భాగంగా ఓ సిరీస్ ను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తుంది.ఈ విషయంపై రాజమౌళి నిసంప్రదించగా సానుకూలంగా స్పందించినట్లు టాక్. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టు చర్చల దశలో ఉంది. దానిపై ఇటు నెట్ ఫ్లిక్స్ సంస్థ, అటు రాజమౌళి బృందం అధికారికంగా స్పందించలేదు.
అయితే నెట్ ఫ్లిక్స్ గతంలో బాహుబలి బిఫోర్ ది బిగినింగ్ ‘ పేరుతో ఓ వెబ్ సిరీస్ ను ప్రారంభించింది. తరువాత కొన్ని రోజులకే ఆ ప్రాజెక్టును రద్దు చేశారు. తాము ఆశించిన స్థాయిలో మేకింగ్ లేదని, మొత్తం స్క్రిప్టును, తెరకెక్కించిన సన్నివేశాలను పక్కకు నెట్టేశారు. ఇప్పుడు ‘ ఆర్ఆర్ఆర్ ‘ సినిమాతో రాజమౌళి అంటే ఏంటో మరోసారి ప్రపంచానికి తెలిసింది. హాలీవుడ్ సైతం సినిమాపై ప్రశంసలు కురిపించారు .దీనివలన రాజమౌళికి నెట్ ఫ్లిక్స్ కి సంబంధించిన వార్తలతో మరోసారి వైరల్ అయింది. అన్ని కుదిరితే రాజమౌళి చేయబోయే ప్రాజెక్ట్ ఏంటి అని తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాలి. మరోవైపు మహేష్ బాబుతో రాజమౌళి ఓ సినిమాను తీయబోతున్నారు. ప్రస్తుత కథ, కథనాలపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది తెరపైకి వస్తుందట. ఈలోపు రాజమౌళి నెట్ ఫ్లిక్స్ సంస్థతో పనిచేసే అవకాశం ఉంది.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…