Ravi Teja Remuneration returned to producers
Ravi Teja : మాస్ మహారాజా రవితేజ ఒకప్పుడు మంచి విజయాలతో టాప్ రేంజ్‌లో ఉండేవాడు. కాని ఇటీవల ఆయన సక్సెస్ కోసం తెగ ఆరాటపడుతున్నాడు. కెరీర్ మధ్యలో కాస్త గ్యాప్ తీసుకున్న రవితేజ రాజా ది గ్రేట్ చిత్రంతో మంచి హిట్ కొట్టాడు. ఇక మధ్యలో క్రాక్ చిత్రం రవితేజ కెరియర్‌కి బూస్టప్ ఇచ్చింది. ఇటీవల వచ్చిన సినిమాలన్నీ వరుస ఫ్లాపులు అవుతున్నాయి. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన రామారావు అన్ డ్యూటీ చిత్రం ఊహించని విధంగా డిజాస్టర్ అయింది. జూలై 29న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈసినిమా విషయంలో మేకర్స్ ను ఆదుకున్నాడట రవితేజ. రవితేజ పోలీస్ ఆఫీసర్ గా నటించి మెప్పించిన ఈ సినిమా కోసం మాస్ మహారాజ్ 15 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్నాడట.
సినిమా దారుణంగా ఫ్లాప్ అయి నిర్మాతలు నష్టాలలో కూరుకుపోయారని తెలుసుకున్న రవితేజ.. రామారావు ఆన్ డ్యూటీ సినిమాకు తీసుకున్న మొత్తం రెమ్యూనరేషన్ 15 కోట్లను వెనక్కి ఇచ్చేసినట్లుగా ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో స్టార్ హీరోలు తమ రెమ్యూనరేషన్లు తగ్గించుకోవాలి అని డిమాండ్లు వినిపిస్తున్న టైమ్ లో.. ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంచి నిర్ణయం తీసుకున్నావంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
రామారావు ఆన్ డ్యూటీ సినిమా ఫుల్ రన్ ముగిసే సరికి దాదాపు 13 కోట్ల నష్టం వస్తుందన్న అంచానాలతో రవితేజ ఈ నిర్ణయం తీసుకున్నారట. ఇర ఈ విషయంలో నిర్మాతలు అలనాటిస్టార్ హీరో కృష్ణను గుర్తు చేసుకుంటున్నారు. ఆయన కూడా నిర్మాత నష్టపోతే తన రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చేవారట. కాగా, రవితేజ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేసుకుంటూ మాస్ ఫుల్ బిజీగా ఉన్నారు. టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర, ధమాకా లాంటి పవర్ ఫుల్ సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఇవి కాకుండా. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో కీలకపాత్రలో కనిపించంబోతున్నారు.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…