singer-mangli-clarity-about-her-marriage
Singer Mangli : ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన జానపద పాటలతో ఎంతోమందిని ఆకట్టుకుంది. చిన్న గ్రామం నుంచి వచ్చి పెద్ద సింగర్ అవార్డు మామూలు విషయం కాదు. ఇక మంగ్లీ మొదట్లో v6 లో మాటకారి మంగ్లీ షో తో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. అలా తన మాటలతో బోనాలు శివుడి జానపద పాటలు పాడింది. అలాగే బతుకమ్మ పాటలు కూడా పాడింది. మొదటిగా మంగ్లీ శైలజ రెడ్డి అల్లుడు సినిమాలో పాట పాడి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఆమెకు సినిమాలలో వరుసగా అవకాశాలు వచ్చాయి. అలా మంగ్లీ రెండు తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.
లంబాడి సామాజిక వర్గానికి చెందిన మంగ్లీ అసలు పేరు సత్యవతి రాథోడ్. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి కర్ణాటక మ్యూజిక్ లో డిప్లమా పూర్తి చేశారు. ఆ తర్వాత యాంకర్ గా తన కెరీర్ ప్రారంభించారు. మ్యూజిక్ పై ఆసక్తి ఉండడంతో సింగర్ గా మారారు. జానపద గాయనిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మొదట మంగ్లీ ప్రైవేట్ ఆల్బమ్స్ చేశారు. అవన్నీ ఆమెకు మంచి పేరును తీసుకొచ్చాయి. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఆల్బమ్స్ రూపొందించారు. అలాగే వివిధ పండుగల సమయాలలో మంగ్లీ పాడిన పాటలు వైరల్ అవుతుంటాయి.
ఈ ఆల్బమ్స్ నే ఆమెను వెండితెరకు పరిచయం చేశాయి. ఈ క్రమంలోనే ఆమె వెండితెరపై ప్లే బ్యాక్ సింగర్ గా స్థిరపడ్డారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో మంగ్లీ పెళ్లి గురించి ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఆమె త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని, అబ్బాయి ఎవరో కాదని తన బావ అని మంగ్లీ పెళ్లాడబోతుందని తెలుస్తుంది. తాజాగా ఈ న్యూస్ పై మంగ్లీ స్పందించింది. తాను నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నట్లు తన బావనే పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపింది. ఏడాది డిసెంబర్ నాటికి పెళ్లి పీటలు ఎక్కవచ్చని అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం సైన్ చేసిన ప్రాజెక్టులను పూర్తి చేసుకుని తర్వాత పెళ్లి చేసుకుంటారని చెబుతున్నారు.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…