sudigali sudheer fans fire on his re entry in etv
Sudigali Sudheer : బుల్లితెర మీద ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్న సెలబ్రిటీ ఎవరైనా ఉన్నారంటే అది సుడిగాలి సుధీర్ అనే చెప్పుకోవాలి. సుడిగాలి సుధీర్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. మెజిషియన్ నుంచి జబర్దస్త్ లోకి కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన సుడిగాలి సుధీర్ ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. జబర్దస్త్ లో టాప్ కమెడియన్ గా ఎదిగిపోయిన సుధీర్ కు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. కొన్ని సినిమాల్లో హీరోగానూ నటించాడు.
ఆ తర్వాత ఆయనకు సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. తనకంటూ సపరేటు ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. ఒక్కోసారి పెద్ద పెద్ద స్టార్ హీరోల కంటే కూడా సుధీర్ కు క్రేజ్ లభిస్తుంది. స్టార్ హీరోలు కూడా సుధీర్ క్రేజ్ ముందు బలాదూరే. ఓవైపు యాంకర్, మరోవైపు కమెడియన్, ఇంకోవైపు సినిమాల్లో నటుడుగా ఫుల్ బిజీ అయిపోయాడు సుధీర్.
అయితే.. సుడిగాలి సుధీర్ ఇటీవల జబర్దస్త్ ను వదిలేసి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. సుధీర్ జబర్దస్త్ నే కాదు.. ఈటీవీ నుంచే తప్పుకున్నాడు. వేరే చానెల్ కు వెళ్లి అక్కడ యాంకరింగ్ చేస్తున్నాడు. దీనిపై సుధీర్ ఫ్యాన్స్ చాలా బాధపడ్డారు. లైఫ్ ఇచ్చిన మల్లెమాల సంస్థను, ఈటీవీని సుధీర్ వెళ్లిపోవడం ఏంటి అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.
అయితే.. ఇటీవల ఈటీవీ 27 ఏళ్ల సెలబ్రేషన్స్ ఈవెంట్ కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. భలే మంచి రోజు పేరుతో ఈవెంట్ ను నిర్వహించారు. దాని ప్రోమోలో సుడిగాలి సుధీర్ కనిపించాడు. సుధీర్ ఈజ్ బ్యాక్ అంటూ ప్రోమోలో చూపించారు.
అయితే.. సుధీర్ ఎంట్రీ ఇవ్వగానే సుధీర్ పై అందరూ పంచులు వేశారు. చివరకు సుధీర్.. ఆది కాళ్ల దగ్గర కూర్చోవడం లాంటివి ప్రోమోలో చూసి సుధీర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుధీర్ రీ ఎంట్రీ ఇచ్చి అందరితో ఇలా పంచ్ లు వేయించుకోవడం ఎందుకు. సుధీర్ కు ఇప్పటికే ఒక హోదా ఉంది. డబ్బుల కోసం ఆ హోదా దాటి ఇంకా కిందికి దిగి ప్రవర్తించడం తమకు నచ్చడం లేదంటూ ఫ్యాన్స్ తెగ మండిపడుతున్నారు.
సుధీర్ కు ఉన్న ఫ్యాన్ బేస్ ను దృష్టిలో పెట్టుకొని అయినా అతడిపై స్టేజ్ మీద పంచులు వేయొద్దంటూ ఇతర కమెడియన్లకు వార్నింగ్ ఇస్తున్నారు సుధీర్ ఫ్యాన్స్. చివరకు మేకప్ మ్యాన్లతో కూడా సుధీర్ పంచులు వేయించుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా.. సుధీర్ పై వేసిన పంచులకు ఆ ఈవెంట్ కు వచ్చిన వాళ్లంతా నవ్వలేక చచ్చారు. మీరు కూడా ఆ ప్రోమోను చూసేయండి మరి.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…