Health Benefits of mokkajonna corns
Health Benefits : మొక్కజొన్న తినటం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి, మొక్కజొన్నలో లినోలిక్ యాసిడ్, విటమిన్ ఇ, విటమిన్ బి1, విటమిన్ బి6, నియాసిన్, ఫోలిక్ యాసిడ్ రెబోఫ్లోవిన్ వంటి విటమిన్ లు ఎక్కువగా ఉంటాయి. మొక్కజొన్నలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది, ఇది జీర్ణక్రియకు బాగా పనిచేస్తుంది,ఆహారంలో పీచు ఉండటం వలన మొక్కజొన్న మలబద్దకం, మొలలు వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది.పేగు క్యాన్సర్ను అరికడుతుంది, ఎముకల బలానికి పోషకాలైన కాపర్, ఐరన్ ఇంకా అవసరమైన లవణాలు, మినరల్స్ అన్ని మొక్కజొన్న లో పుష్కలంగా ఉంటాయి, పసుపు రంగులో ఉండే ఈ చిన్ని గింజలలో మినరల్స్ అదికo, మెగ్నీషియం, ఐరన్, కాపర్, ఫాస్పరస్ వంటివి మొక్కజొన్నలో ఉండడం తో ఎముకలు గట్టి పడేలా చేస్తోంది.
కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడంలో ను మొక్కజొన్న ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి, ఇవి చర్మాన్ని కాంతివంతంగా ఉంచడమే కాదు, శరీరంపై ముడతలు రాకుండా చేస్తాయి. మొక్కజొన్న గింజల నూనె చర్మ సంబంధిత వ్యాధులకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. దీనిలో ఉండే లినోలిక్ యాసిడ్, చర్మ మంటలను, రాషెస్ లను తగ్గిస్తుంది. రక్తహీనత ఉన్నవారికి మొక్కజొన్న ఒక అద్భుతమైన వరం. మొక్కజొన్నలో ఫోలిక్ యాసిడ్ ఉండటం వలన అది రక్తహీనతను తగ్గించి, ఎర్ర రక్తకణాలను వృద్ధి పెంచుతుంది.అంతేకాదు రక్తకణాల్లోని కొలెస్ట్రాల్ను తగ్గించడం ద్వారా, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇంకా రక్తనాళాల్లో ఏర్పడే అడ్డంకులను తొలగించి, రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది, తద్వారా గుండెపోటు, పక్షవాతం, బీపీ మొదలైన సమస్యలను అదుపులో ఉంచుతుంది.
రోజూ మొక్కజొన్న తినేవారికి, జుట్టు బలంగా ఉంటుంది. మొక్కజొన్నలో ఉండే విటమిన్లు జుట్టూను స్మూత్ గా, మంచి షైనింగ్ గా ఉండేలా చేస్తుంది. అంతేకాదు, ఇది తక్షణ శక్తిని ఇచ్చే, ఆహారపదార్థం. దీనిని తినడం వలన, ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. ఇందులో ఖనిజాలు, పోషకాల శాతం కుడా ఎక్కువగానే ఉంటుంది. తరచుగా మొక్కజొన్నలను తినడం వలన, హైపర్ టెన్షన్ కూడా దూరమవుతుంది. బీపీ, షుగర్, గుండెజబ్బులు అన్నింటికీ సరైన ఆహారం మొక్కజొన్న. అందుకే వర్షాకాలంలో సరదాగా తినడానికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి మేలు చేసే మొక్కజొన్నను మీ ఆహారంలో భాగం దూరం చేసుకోండి, ఆరోగ్యంగా ఉండండి.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…