home remedy to reduce toothache
Toothache : ప్రస్తుత కాలంలో దంత సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. పంటి నొప్పి అనేది చిన్న సమస్య అయినా నొప్పి మాత్రం విపరీతంగా ఉంటుంది. దంతాలలో సమస్య వల్ల ఈ నొప్పి వస్తుంది. ఈ సమస్య డాక్టర్ వద్దకు వెళ్లి చికిత్స చేయడం వల్ల కొంచెం ఉపశమనం కలుగుతుంది. కానీ నొప్పి తక్కువగా ఉంటే ఇంట్లోనే తగ్గించుకోవచ్చు. పంటి నొప్పిని తగ్గించడానికి చాలా రకాల ఇంటి చిట్కాలు అందుబాటులో ఉన్నాయి.
ఇప్పుడు పంటి నొప్పిని తగ్గించే చిట్కాల గురించి తెలుసుకుందాం. పంటి నొప్పిని తగ్గించడానికి సాల్ట్ వాటర్ బాగా సహాయపడతాయి. పంటి నొప్పి రాగానే గోరువెచ్చని నీళ్లలో కాస్త ఉప్పుని వేసి సాల్ట్ కరిగిన తర్వాత ఈ ఉప్పు నీళ్లతో ఐదు నిమిషాల పాటు పుకిలించాలి. ఇలా చేయడం వల్ల నొప్పి తగ్గటంతో పాటు పంటిసంధుల్లో ఉన్న ఆహార పదార్థాలు బయటకు వస్తాయి. అలాగే పంటి నొప్పి ఉన్నచోట ఐస్ క్యూబ్ ను క్లాత్ లో ఉంచి నొప్పి ఉన్నచోట ఐదు నిమిషాల పాటు మర్దన చేయడం వల్ల నొప్పి నుండి కొద్దిగా ఉపశమనం కలుగుతుంది.
దీనివల్ల రక్తనాళాలు సంకోసించి నొప్పి తగ్గుతుంది. పంటి నొప్పి ఉన్నచోట వెల్లుల్లి పేస్ట్ ని అప్లై చేయాలి. ఈ పేస్టులో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉంటాయి. ఇవి బ్యాక్టీరియాల్ని చంపి నొప్పిని తగ్గిస్తాయి. పంటి నొప్పి అధికంగా ఉన్నప్పుడు లవంగం నూనె అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల వెంటనే నొప్పి ,వాపు తగ్గుతుంది. నొప్పి తరచుగా వస్తున్నప్పుడు మౌత్ వాష్ ని వాడాలి. మౌత్ వాష్ లో హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉంటుంది. ఇది బ్యాక్టీరియా అని చంపేందుకు ఉపయోగపడుతుంది
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…