Ultimate hair fall remedy
Hair Growth Tips : ఈ రోజుల్లో ఉన్న సమస్యల్లో జుట్టు రాలే సమస్య ఒకటి. మహిళలు పొడవాటి నల్లటి జుట్టు కోసం ఎన్నో రకాల చిట్కాలు ఫాలో అవుతూ ఉంటారు. కానీ ఫలితం మాత్రం ఉండదు. తల దువ్వితే చాలు దువ్వెన నిండా ఇంటిలో జుట్టు కనిపిస్తుంది. అది చూసి జుట్టు రాలే సమస్యలను ఎలాగైనా తగ్గించుకోవాలని వివిధ రకాల ప్యాక్ల ను, నూనెను ఉపయోగిస్తున్నారు. కెమికల్ ఉన్న హెయిర్ పాక్స్, ఆయిల్ ఉపయోగించడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి.
నాచురల్ పద్ధతి ద్వారా జుట్టు రాలే సమస్యను ఎలా తగ్గించుకోవచ్చు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ రెమెడీ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కొబ్బరికాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జారీలో వేసి చిన్న గ్లాస్ వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా గ్రైండ్ చేయడం వల్ల కొబ్బరి పాలు ఎక్కువగా వస్తాయి. ఆ తరువాత కాటన్ క్లాత్ తీసుకుని వడకట్టుకుని పాలను తీసుకోవాలి. ఈ కొబ్బరి పాలలో చిన్నచిన్న అరటి పండు ముక్కలను కట్ చేసుకుని తీసుకోవాలి.
అరటిపండును ఎవైడ్ చేయాలనుకున్నవారు ఆ ప్లేస్ లో అలోవెరా లేదా అవిస గింజలు జెల్ ఉపయోగించవచ్చు. ఆ తర్వాత బాగా ఎండిన మందార పూల చూర్ణాన్ని రెండు చెంచాలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమంలో అరకప్పు కొబ్బరి పాలు వేసుకొని బాగా కలుపుకొవాలి. ఆ తర్వాత రెండు స్పూన్ల క్యాస్టర్ నూనె వేసి బాగా కలుపుకోవాలి.
ఈ ఆయిల్ వద్దనుకున్నా వారు బాధ నూనె లేదా ఆవాలు నూనె కొబ్బరి నూనె కూడా ఉపయోగించవచ్చు. ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేసి ఐదు నిమిషాల పాటు మర్దన చేయాలి. ఇలా అప్లై చేసిన తర్వాత గంట పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత పూర్తిగా డ్రై అయిన తర్వాత ఏదైనా ఆర్గానిక్ షాంపుతో వాష్ చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గి వెంట్రుకలు ఒత్తుగా పొడవుగా పెరగడమే కాకుండా చుండ్రు, జుట్టు చిట్లు పోవడం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…