Categories: News

11 ఏళ్లకు పెళ్లి, 20 ఏళ్లకు తండ్రి…ఇది నీట్ ర్యాంకర్ స్టొరీ..!

డాక్టర్ కావాలనుకున్నాడు. అనుకున్న లక్ష్యానికి నాలుగుసార్లు సుదూరంగానే ఉండిపోయాడు. ఐదో ప్రయత్నంలో తాను అనుకున్న లక్ష్యాన్ని చేరాడు ఓ యువకుడు. 11 ఏళ్లకే పెళ్లి చేసుకుని 20ఏళ్లకు తండ్రి అయ్యి ఇప్పుడు నీట్ ర్యాంకర్ గా మారిన యువకుడి కథ ఇప్పుడు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది.

కొన్ని రోజుల కిందట ఆల్ ఇండియా మెడికల్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్ – 2023) ఫలితాలు వచ్చాయి. వీరిలో 700కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు చాలామందే ఉన్నారు కానీ అందరిలో రాజస్తాన్ కు చెందిన రాంలాల్ భోయ్ ది ప్రత్యేక స్టొరీ. చిత్తోర్ గఢ్ జిల్లాకు చెందిన రాంలాల్ భోయ్ కు డాక్టర్ కావాలని ఆశ. కానీ అతనికి పదకొండేళ్ళ వయస్సులో పెళ్లి చేశారు. అప్పుడు అతను ఆరో తరగతి చదువుతున్నాడు. తన భార్య 18ఏళ్ళు నిండిన తరువాత ఓ కుమార్తెకు జన్మనిచ్చింది.

చదువుపై ఎంత ఇష్టం ఉన్నా పెళ్లి కాగానే కుటుంబ బాధ్యతల వలన దృష్టి మరల్తుంది. కానీ ఆ యువకుడు మాత్రం పట్టుదలగా చదివాడు. పదో తరగతి తరువాత ఏ గ్రూప్ ఎంచుకోవాలనే విషయంలోనూ అతనికి ఓ క్లారిటీ లేదు. కానీ సైన్స్ లో అతనికున్న ఆసక్తిని గమనించిన అతని టీచర్ ఒకరు బైసీపీ తీసుకోమని సూచించాడు. 81% మార్కులతో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన రాంలాల్…ఎలాగైనా డాక్టర్ కావాలనుకున్నాడు.

డాక్టర్ కావాలని ప్రిపెరేషన్ మొదలెట్టాడు. నాలుగుసార్లు నీట్ పరీక్ష రాసినా 720కి 350, 320, 362, 490 ల చొప్పున మార్కులు సాధించగలిగాడు. డాక్టర్ కావడం నీ వలన అయ్యే పని కాదు కానీ, ఎంచక్కా మరో పని చూసుకొని కుటుంబానికి ఆసరాగా నిలబడు అనే వ్యాఖ్యలు అతని మనస్సును గాయపరిచాయి కానీ లక్ష్యాన్ని కాదు. అందుకే పట్టుదలతో చివరిసారి చదివి నీట్ యూజీ పరీక్షలో 632 మార్కులు సాధించాడు.

tech desk

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago