బీఆర్ఎస్ ను ఓడించేందుకు రాజకీయ పునరేకీకరణ జరగాలని కోరుకుంటున్న కాంగ్రెస్ ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టిందా..? ఇందులో భాగంగా టీజెఎస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలని కోదండరాం ముందు హస్తం నేతలు ప్రతిపాదనలు పెట్టారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది.
కర్ణాటక ఎన్నికల ఫలితం తరువాత టి. కాంగ్రెస్ కు అధికారంపై మరింత ఆశ పుట్టింది. ఎన్నికలకు ముందు కాస్త అటు, ఇటుగా తెలంగాణ పరిస్థితులే కర్ణాటకలోనూ ఉన్నాయి. అయినప్పటికీ అసలే ఆశలు లేని స్థితి నుంచి అధికారంలోకి వచ్చేంత బలం సంపాదించుకుంది కన్నడ కాంగ్రెస్. దాంతో కాస్త కష్టపడితే కర్ణాటక మాదిరి తెలంగాణలోనూ అధికారంలోకు రావొచ్చుననేది హస్తం నేతల ఆలోచన. అందుకే పార్టీలోకి చేరికలను స్పీడప్ చేయాలనుకుంటుంది రాష్ట్ర నాయకత్వం. ఈ క్రమంలోనే పొంగులేటి, జూపల్లిలను కాంగ్రెస్ లో చేరే విధంగా తెర వెనక మంత్రాంగం నడిపిన కాంగ్రెస్.. ఇప్పుడు మరో కీలక నేతను పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
ప్రొ. కోదండరాం. తెలంగాణ పరిచయం అక్కర్లేని పేరు. టీజెఏసీ చైర్మన్ గా తెలంగాణ మలిదశ ఉద్యమానికి నాయకత్వం వహించిన కోదండరాం, టీజేఎస్ పార్టీని స్థాపించారు. కానీ పార్టీ అనుకున్న విధంగా సక్సెస్ కాలేకపోయింది. ఇప్పుడు ఆయన లక్ష్యం ఒకటే. ఉద్యమ ఆకాంక్షలకు విరుద్దంగా పాలన కొనసాగిస్తున్న బీఆర్ఎస్ ను ఇంటికి సాగనంపడమే. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ కనిపిస్తోంది. కనుక ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంక్ చీలిపోకుండా కాంగ్రెస్ వెంట నడవాలని కోదండరాంను కోరారు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్.
బీఆర్ఎస్ బహిష్కృత నేత, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు నివాసంలో కోదండరాంతోనూ సంపత్ కుమార్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాజకీయ అంశాలపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ లో చేరాలని కోదండరాంను ఆహ్వానించగా గత ఎన్నికల సమయంలో జరిగిన అంశాలను సంపత్ ముందు లేవనెత్తినట్లు సమాచారం. పార్టీలో చేరితే కోదండరాంకు ఏఐసీసీ లేదా పీసీసీ స్థాయిలో కీలక పదవి ఇస్తామని ఏఐసీసీ పెద్దలు చెప్పినట్లు తెలుస్తోంది. ఇందుకు కోదండరాం సానుకూలంగా స్పందించారా..? లేదా అనే విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచారు. ఇక భేటీ అనంతరం సంపత్ మాట్లాడుతూ తాను ఏఐసీసీ ప్రతినిధిగానే ఇక్కడికి వచ్చానని పేర్కొనటం విశేషం.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…