TDP should work under Jana Sena.........Nagababu strong warning....
Naga Babu : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడంతో ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయాలు వేడెక్కాయి. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుతో మొలకత్ అనంతరం మీడియాతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ టిడిపి జనసేన కలిసి నడుస్తాయని ప్రకటించిన సంగతి తెలిసిందే . వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీతో కలిసి జనసేన ముందుకెళ్తుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. దీంతో పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ అధికార వైసిపి నేతలు కామెంట్స్ చేశారు.
పవన్ కళ్యాణ్ ముసుగు తొలగిపోయిందని ప్యాకేజ్ కోసం మరోసారి జనసేనను పవన్ తాకట్టు పెట్టాడని వైసీపీ నాయకులు విమర్శలు చేశారు. అయితే పొత్తు వ్యవహారంపై తాజాగా పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు స్పందించారు. టిడిపి పొత్తుపై జనసేన నేత నటుడు నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. వచ్చే ఎన్నికలలో జనసేన కిందనే టీడీపీ పనిచేస్తుందంటూ కార్యకర్తలను ఉద్దేశించి నాగబాబు పేర్కొన్నారు. అయితే చిత్తూరు పర్యటనలో ఉన్న నాగబాబు అక్కడి జనసేన నేతలను కలిసి సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా జనసేన నాయకులు టిడిపి పొత్తు ప్రస్తావని తీసుకురాగా, గతంలో టిడిపి నాయకులు తమని టార్చర్ చేశారంటూ నాగబాబుతో మొరపెట్టుకున్నారు. అయితే గతం గురించి మర్చిపోయి ముందుకు వెళ్దామని కార్యకర్తలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు నాగబాబు. ఈ క్రమంలో నాగబాబు మాట్లాడుతూ టిడిపి మన కిందే పని చేసిందంటూ సంచల కామెంట్స్ చేశాడు. పొత్తులు కొనసాగిన జనసేన అజెండానే ముందుకు తీసుకెళ్లాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. పవర్ లోకి వస్తే పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారం లేపుతున్నాయి.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…