మరో ఐదారు నెలలో తెలంగాణ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల మూడ్ లోకి వచ్చేస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డారు. కాంగ్రెస్ కూడా ఇదే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక బీజేపీ పరిస్థితి కాస్త ఆందోళనకరంగానే ఉంది. వలస నేతలు కాంగ్రెస్ లో చేరుతారనే ఆందోళన ఆ పార్టీని వేధిస్తోంది. షర్మిల కూడా ఏదో ఒక పార్టీతో జత కట్టే ఆలోచనతో అడుగులు వేస్తున్నారు.
మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ప్రజల్లో ఓ భావన కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే ఈసారి వందసీట్లు మావే అంటున్నారు. అధికారంపై ధీమాగా ఉన్నామని చెబుతున్నా ఏమాత్రం ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవడం లేదు. రేవంత్ కూడా మంచీ టచ్ లో కనిపిస్తున్నారు. ఇప్పటికే ఓ దఫా పాదయాత్ర పూర్తి చేసి ఉత్తర తెలంగాణలో పార్టీ బలోపేతానికి చేయాల్సిన కృషి చేశారు. రేవంత్ తోపాటు భట్టి కూడా పాదయాత్ర చేస్తుండటంతో కాంగ్రెస్ కాస్త పుంజుకుంది.
బీజేపీ మాత్రం కర్ణాటక ఎన్నికల ఫలితాల తరువాత డీలా పడిపోయింది. వచ్చే నేతలు పార్టీలో చేరక, ఉన్న నేతలను కాపాడుకోలేక ఆ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ కాకపోవడంతో, బీఆర్ఎస్ – బీజేపీల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగి ఉంటుందన్న అనుమానాలు ప్రజల్లో ఉన్నాయని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ఇప్పుడు ఏమైనా కీలక నిర్ణయాలు తీసుకుంటారేమో క్లారిటీ లేదు కానీ ఏదో నిర్ణయం తీసుకోకపొతె మాత్రం అది బీజేపీకి మైనస్ గా, కాంగ్రెస్ కు ప్లస్ గా మారడం ఖాయం.
మొత్తానికి జూన్ మాసం రావడంతో అన్ని పార్టీలు ఎన్నికల మూడ్ లోకి వచ్చేశాయి. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ఫండింగ్ పై దృష్టి పెడుతున్నాయి.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…