Reliance's new innovation...battery charge in six seconds..
Reliance : ప్రముఖ దిగ్గజ వ్యాపార సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎలక్ట్రిక్ వాహనాల కోసం స్వాపబుల్ బ్యాటరీలను ఆవిష్కరించింది. ఇక ఈ ఆవిష్కరణ గ్రేటర్ నోయిడా రెన్యువబుల్ ఎనర్జీ ఇండియా ఎక్స్ పో తో పాటు నిర్వహిస్తున్న” ది బ్యాటరీ షో ఇండియా” మొదటి ఎడిషన్ సందర్భంగా జరిగింది. అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అయితే స్వాపబుల్ బ్యాటరీల కాన్సెప్ట్ ఇప్పటికే మ్యానుఫ్యాక్చరింగ్ దశను పూర్తి చేసుకుందని, వచ్చే ఏడాది కల్లా ఇది కస్టమర్లకు అందుబాటులోకి వస్తుందని కంపెనీ ఎగ్జిక్యూటర్లు తెలియజేశారు. ఇక ఈ బ్యాటరీతో ఒకసారి చార్జ్ చేసి దాదాపు 70 నుండి 75 కిలోమీటర్ల వరకు వెళ్లవచ్చు. అంతేకాక ఈ బ్యాటరీలను సౌర శక్తిని ఉపయోగించి కూడా చార్జ్ చేసుకోవచ్చు.
ఇక ఈ రిలయన్స్ బ్యాటరీలు కేవలం వాహనాలకు మాత్రమే కాకుండా , గృహ ఉపకరణాలకు కూడా ఉపయోగించేలా తయారు చేసామని సంబంధిత అధికారులు తెలియజేశారు. అయితే వాస్తవానికి వాహన వినియోగదారుడు చార్జింగ్ అయిపోయిన వెంటనే బ్యాటరీ మార్చుకోవాల్సి ఉంటుంది. కావున ఆ బ్యాటరీని ఇంట్లో లేదా ఆఫీసులో కూడా మార్చుకోవచ్చు. అలాగే ఇవి స్టేషన్స్ లో చార్జింగ్ అయిపోయిన బ్యాటరీస్ ఇచ్చేసి ఫుల్ ఛార్జ్ బ్యాటరీ ని కూడా పొందవచ్చు. ఇక ఈ బ్యాటరీని మార్చుకోవడానికి కేవలం 6 సెకండ్ల సమయం పడుతుందని అధికారులు తెలియజేశారు.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…