grand papa funny moment with his wife in shashti poorthi video viral
Viral Video : కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, సంతోషం వచ్చినా, బాధేసినా.. డిప్రెషన్ లో ఉన్నా ఏదైనా సరే సోషల్ మీడియానే శరణ్యం. అదే వాళ్లకు దిక్కు. చాలామంది యూత్ అయితే పొద్దున లేస్తే సోషల్ మీడియాలోనే కాలం గడుపుతున్నారు. యువతులు కానీ.. యువత కానీ.. ఎవ్వరైనా సరే తమ మెమోరబుల్ మూమెంట్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ముఖ్యంగా యువతులు అయితే తమ టాలెంట్ ను సోషల్ మీడియా వేదికగా ప్రదర్శిస్తున్నారు.
తాజాగా ఓ జంట.. సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. జంట అనగానే మీరు యూత్ అనుకునేరు. వృద్ధ జంట గురించే మనం మాట్లాడుకునేది. ఆ వృద్ధ జంటకు తమ పిల్లలు షష్ఠి పూర్తి చేశారు. ఆ సమయంలో తీసిన వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
షష్ఠి పూర్తి సందర్భంగా తాత.. బామ్మతో చిలిపి చేష్టలు చేశాడు. తనకు దండ వేస్తున్నప్పుడు, తాళి కడుతున్నప్పుడు, ఫోటోలు దిగుతున్నప్పుడు తాత చేసిన చిలిపి చేష్టలు మామూలుగా లేవు. తాళి కట్టడంతో పాటు ఫోటో దిగే సమయంలో ముసలమ్మ బుగ్గను పట్టుకొని గిల్లాడు. ముసలమ్మను నవ్వు అంటూ తాత చేసిన చిలిపి చేష్టలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి.
వామ్మో.. తాత నువ్వు ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా యుక్త వయసులో ఎలా ఉన్నావో.. అప్పుడు చెలరేగిపోయి ఉంటావు కదా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఏం తాతా ఇంకా పౌరుషం తగ్గలేదా? నీకు నువ్వే సాటిపో. షష్ఠి పూర్తిలో కూడా ఇలా రెచ్చిపోతున్నావంటే.. పెళ్లయిన కొత్తలో ఇంకెంతలా రెచ్చిపోయి ఉంటావు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియోను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆ వీడియో గురించే చర్చ.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…