Aacharya Chanakya spiritual speech about wife
Chanakya Niti : ఆచార్య చాణక్యుడు 371 BC, బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఈయన గొప్ప విద్యావేత్త. బుద్ధి బలం కలవాడు. ఒక రాజ్యాన్ని ఏలగల సమర్ధుడు. చాణక్యుడు నీతి శాస్త్రాన్ని రచించాడు. ఇప్పటికీ ఈ నీతి శాస్త్రాన్ని ఎంతోమంది అనుసరిస్తున్నారు. ఈ గ్రంథంలో ఒక మనిషి ఎటువంటి మార్గంలో వెళ్లాలి, ఎటువంటి నిర్ణయాలను తీసుకోవాలి అను మొదలగు విషయాలు ఉంటాయి. అయితే ఈ శాస్త్రంలో భార్య గుణగణాలకు సంబంధించి అనేక వివరాలను చాణుక్యులు తెలిపారు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1) భార్య భర్తతో ఎప్పుడు నిజమే మాట్లాడుతూ, ధర్మాన్ని అనుసరిస్తూ, భర్తను గౌరవించి, ప్రేమించి, అతని సుఖదుఃఖాలలో పాలుపంచుకోవడానికి సిద్ధపడ గలిగేలా ఉండాలి. ఇలాంటి స్త్రీ భాగస్వామిగా రావడం అదృష్టం వలనే ఎవరికైనా లభిస్తుంది. అలాంటి స్త్రీ భాగస్వామిగా వస్తే ఆ భర్త వారిని ఎల్లప్పుడూ గౌరవించి, ప్రేమగా చూసుకోవాలి.
2) భార్య కష్టాలు రాకుండా ఉండేందుకు డబ్బును ఆదా చేయాలని ఆచార్య సూచించారు. అయితే భార్యకు ఆపద వస్తే మాత్రం డబ్బు గురించి అసలు చింతించవద్దు. ఆత్మగౌరవం విషయానికి వస్తే డబ్బు, భార్య రెండింటిని త్యాగం చేయాలి. ఆ సమయంలో ఆలోచించాల్సిన అవసరం లేదని ఆచార్య చాణక్యుడు తెలిపారు.
3) భార్య రూపవతి అయిన, సామాన్యమైనదైన, చురుకున్నదైన, నిరక్షరాస్యులైన, సంస్కారవంతురాలు అయి ఉండి కుటుంబాన్ని మెరుగ్గా నిర్వహించగల సామర్థ్యం ఉన్నట్లయితే భర్త ఎల్లప్పుడూ ఆమెను గౌరవించాలి. ఆమెతో మంచి సంబంధాన్ని కలిగి ఉండాలని అన్నారు. ఆమె స్వరూపం కంటే లక్షణాలే ముఖ్యమైనమని ఆచార్య తెలిపారు.
4) మీ భార్య ఎంత నమ్మదగినది అని తెలుసుకోవాలంటే చాలా నమ్మకమైన పనిని ఆమెకు అప్పగించాలి. ఇది వారి ఉద్దేశాల గురించి తెలియజేస్తుంది. అంతేకాకుండా మీకు డబ్బు, కీర్తి లేనప్పుడు మీ భార్యను పరీక్షించడం ద్వారా ఆమె నిజంగా మీ పట్ల అంకిత భావంతో ఉందో లేదో తెలుస్తుంది.
5) ఒక స్త్రీ ఇల్లు కట్టుకోగలదు అలాగే నాశనం కూడా చేయగలరు. భార్య దుష్ట స్వభావం కలిగి ఉంటే ఆమెతో జీవించకపోవడం మంచిది. అలాంటి భార్య మొత్తం కుటుంబాన్ని నాశనం చేస్తుంది. అలాంటి వారితో ఉండడం వలన ఇంట్లో ఎప్పుడు సంతోషం, శాంతి ఉండదు
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…