Guppedantha Manasu 23rd July Today Episode
Guppedantha Manasu 23rd July Today Episode : రిషి తనకి అసిస్టెంట్ ఎవరు ఉండాలో అని సాక్షి , వసుధార మధ్య పోటీ పెడతారు. మూడు ప్రశ్నలు అడుగుతాను ఎవరు గెలిస్తే వారే అసిస్టెంట్ గా ఉంటారు అని అంటాడు.మొదటి ప్రశ్నకి సాక్షి కి ఏడు ఓట్లు, వసుధార కి అయిదు ఓట్లు వస్తాయి. రెండవ ప్రశ్నకి కూడా సాక్షి కి ఏడు ఓట్లు, వసుధార కి అయిదు ఓట్లు వస్తాయి. మూడవ ప్రశ్న మనిషి ఎలా ఉండాలి అని అడుగుతారు. అప్పుడు సాక్షి , వసుధార దానికి సమాధానం చెబుతారు. అయితే మనిషి ఎలా ఉండాలి అని వసుధార చాలా బాగా మాట్లాడుతుంది.
దాంతో అక్కడ ఉన్నవాళ్లు అందరూ చప్పట్లు కొడతారు. మూడవ రౌండులో మేము వసుధార కే ఓటు వేసి తననే గెలిపిస్తాం అని అందరూ అంటారు. ఆ సమాధానం మేము గౌరవిస్తాం సార్ అని, ఒక మనిషి గురించి చాలా గొప్పగా చెప్పింది. నిజంగా మనిషి అంటే అలానే ఉండాలి ఇక నుంచి అలానే ఉండటానికి ట్రై చేస్తాం అని అంటారు.దాంతో వసుధార గెలిచింది అని రిషి ప్రకటిస్తాడు. అప్పుడు రిషి వసుధార తో కంగ్రాచ్యులేషన్స్ వసుధార, గెలుపు ఓటములు పక్కకుపెడితే నువ్వు చివర్లో చెప్పిన సమాధానం చాలా బాగుంది అని అంటాడు.
వసుధార ను అసిస్టెంట్ గా ప్రకటిస్తాడు రిషి.తరువాత రిషి కారు దగ్గర నిల్చొని, వసుధార గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంత బాగా మాట్లాడింది. ఇన్ని తెలివితేటలు ఉన్నాయి వసుంధారకి. కానీ నా మనసు అర్థం చేసుకోవటం లేదు అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ఒక స్టూడెంట్ అక్కడి నుంచి వెళుతూ ఉంటే, వసుధార ని చూశావా అని అడుగుతాడు. అప్పుడు లేదు సార్ పిలవమంటారా అని అంటాడు. దాంతో రిషి వద్దులే అని అంటాడు. ఇంతలో దేవయాని రిషికి ఫోన్ చేస్తుంది. నాకు చాలా సంతోషంగా ఉంది సాక్షిని అసిస్టెంట్గా తీసుకున్నావు కదా, సాక్షి నాకు ఫోన్ చేసి చెప్పింది నీతో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది అని, కన్ఫమ్ చేయలేదు అని చెప్పింది.
అప్పుడు రిషి పెద్దమ్మా నేను తనని అసిస్టెంట్ గా తీసుకున్నాను. కానీ, నాకు కాదు. జగతి మేడమ్ కి అసిస్టెంట్ గా తీసుకున్నాను అని అంటాడు. అప్పుడు దేవయాని ఏమైంది నీకు రిషి , జగతి కి అసిస్టెంట్గా ఏంటి అని అంటాడు. అప్పుడు రిషి తన మీద సానుభూతితో కాదు, తన పని కాలేజ్ కి సంబంధించింది. ఇంతకన్నా ఎక్కువ ఏమిచెయ్యలేను, ప్రస్తుతానికి ఏమీ చెప్పలేను పెద్దమ్మా అని ఫోన్ కట్ చేశాడు రిషి. ఒకవైపు సాక్షి, ఏంటో ఇక్కడికొచ్చి పడ్డాను, ఇక్కడ కూడా చేయను అంటే కాలేజీకి వచ్చే అవకాశం ఉండదేమో అని మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడు జగతి, సాక్షి అని పిలవగానే, సాక్షి ఆంటీ అంటోంది. ఇక్కడ ఆంటీ అని కాదు మేడం అని పిలవాలి అని అంటుంది జగతి.
అప్పుడు సాక్షి నిజానికి ఇక్కడ పని చేయడం నాకు ఇష్టం లేదు మేడం అని అంటుంది. ఆ మాట నువ్వు చెప్పాల్సిన పని లేదు నాకు తెలుస్తుంది సాక్షి, కానీ జీవితంలో అన్నీ మనకు ఇష్టమైన పనులు చేయాలని కుదరదు, అని అంటుంది. అప్పుడు తరువాత పుష్పతో పుష్ప కొన్ని ఇన్విటేషన్ మెయిల్కి పంపించాలి కదా ఆ పని సాక్షికి చెప్పు అని అంటుంది. సాక్షి ఇంగ్లీష్ బాగుంటుంది, ముఖ్యంగా తను తెలివైనది కదా అని తనకి ఆ వర్క్ ఇవ్వు అని అంటుంది జగతి. అప్పుడు పుష్ప, సాక్షి గారు వెళదామా అని అంటే, సాక్షి గారు కాదు మేడమ్ అని పిలువు అని అంటుంది.
దాంతో ఓకె మేడం వెళదామా అని అంటుంది పుష్ప. అప్పుడు సాక్షి చిరాకుగా వెళ్దామని వెళుతుంది. దానిని గమనించిన జగతి నవ్వుకుంటూ మనస్సులో సాక్షి అంచనాలను రిషి భలే తారుమారు చేశాడు అని అనుకుంటూ ఉంటుంది. తర్వాత రిషి ఇంటికి వెళ్లి బోర్డుమీద వసుధార గీసిన బొమ్మ నీ గురించి ఆలోచిస్తూ వుంటాడు. అది వసుధార గీసింది కాని తను ఒప్పుకోవటం లేదు అని ఆలోచిస్తూ ఉంటాడు. వసుధార ఏం చేస్తుందో తనకి ఫోన్ చేద్దామని చేస్తాడు రిషి. ఆ బొమ్మ ఎవరు గీశారు అని అంటాడు. ఏం బొమ్మ సార్ అని వసుధరా అంటుంది. అప్పుడు రిషి ఏంలేదు కాలేజ్కి తొందరగా వచ్చేయ్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఇంతలో గౌతమ్, రిషి దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నావురా అని అంటాడు.
అప్పుడు రిషి ఆలోచిస్తున్నాను అని అంటాడు. అప్పుడు మహేంద్ర ఏం ఆలోచిస్తున్నావ్ తెలుసుకోవచ్చ అని అంటాడు. కాలేజీలో జరిగబొయే చదువుల పండగ గురించి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను అని అంటాడు. అప్పుడు గౌతమ్ అందరికీ మంచి ఫుడ్ అరెంజ్ చేద్దామా అంటే, అది అప్పుడు ఫుడ్ ఫెస్టివల్ అవుతుంది అని రిషి అంటాడు. కాలేజ్ సింబల్ లోగోతో జెండాలు తయారుచేసి ఒక్కొక్క టీమ్ కి అరేంజ్ చేద్దాము అని అంటాడు.ఇలా ముగ్గురు మాట్లాడుకుంటారు.తరువాత రిషి వసుధారకి ఫోన్ చేసి ఐడియా చెప్దామా, వద్దులే ప్రతీసారి నేనే ఎందుకు చేయాలి అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…