Astrology tips what happens tie the black thread
Astrology tips : ఇప్పుడు చాలా మంది కాలికి నల్లదారం కట్టుకుంటున్నారు. కొందరు ఫ్యాషన్ గా ఉంటుందని ధరిస్తున్నారు. మరి కొందరు చెడు కళ్ళు లేదా చేతబడి నివారించడానికి ఉపయోగిస్తున్నారు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం నలుపు రంగు చెడు కళ్ళు లేదా దుష్టశక్తుల నుండి రక్షిస్తుంది అని జ్యోతిష్యులు చెబుతున్నారు. చాలామంది తమ చేతికి లేదా కాళ్ళకి నల్లటి దారాన్ని కట్టుకుంటున్నారు. కొంతమంది అందంగా కనిపించడానికి కట్టుకుంటారు. అయితే నలుపు రంగు ఎవరైనా మనల్ని చెడు దృష్టితో చూస్తే అది మనపై ఎలాంటి దుష్ప్రభావం కలిగించకుండా ఉంటుందట. అలాగే నల్ల దారం మనల్ని చూసి ఈర్ష్య పడే వారి దృష్టిని మరల్చుతుందని నమ్ముతారు. మనపై చెడు పడకుండా ఉండేందుకు ఇది సహకరిస్తుందని నమ్ముతుంటారు. అయితే అందరూ నల్ల దారాన్ని ధరించకూడదు.
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం రెండు రాశుల వారు మాత్రమే నల్లదారాన్ని ధరించాలి. ఒకవేళ దానిని ధరిస్తే వారికి కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మేష రాశి వారు నల్లదారం అస్సలు ధరించకూడదు. ఎందుకంటే మేషరాశిని అంగారక గ్రహం పాలిస్తుంది. కుజుడు నలుపు రంగును ఇష్టపడడు. అందుకే ఈ రాశి వారు నల్లదారం కట్టుకుంటే జీవితంలో ఇబ్బందులు వస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. మేష రాశి వారు నల్లదారం ధరించడం వలన డిప్రెషన్ వంటి సమస్యలను ఎదుర్కొంటారు. అందుకే మేషరాశి వారు నల్లదారాన్ని ధరించకూడదు. నలుపు రంగుకు బదులుగా ఎరుపు రంగు వాడడం మంచిది. అలాగే వృశ్చిక రాశిని కూడా అంగారక గ్రహం పాలిస్తుంది. కాబట్టి వీరు కూడా నలుపు రంగు దారాన్ని ధరించకూడదు.
ఒకవేళ ధరిస్తే అరిష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. వృశ్చిక రాశి వారు నల్లదారం కట్టుకుంటే మంగళ దేవుడికి కోపం వస్తుంది. ఇది జీవితంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి దీనికి దూరంగా ఉండడమే మంచిది. వృశ్చిక రాశి వారు నల్లదారం కట్టడం వలన అంగారకుడి యొక్క శుభ ప్రభావం ముగుస్తుంది. పేదరికం జీవితంలోకి రావడం ప్రారంభిస్తుంది. అందుకే నల్ల దారానికి బదులుగా ఎరుపు రంగు దారం ధరించడం మంచిది. ఎరుపు రంగు దారం కట్టుకోవడం వలన వృశ్చిక రాశి వారికి మేలు జరిగే అవకాశం ఉంది. తుల, కుంభ రాశి వారు నల్లదారాన్ని ధరించడం మంచిది. శని గ్రహం కుంభం తులా రాశి ప్రభావితం చేయడమే దీనికి కారణం. తుల, కుంభ రాశి వారు నల్లదారాన్ని కట్టుకుంటే ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…