another-star-hero-in-kannappas-project-manchu-vishnu-has-planned-hard-bhaiyya
Kannappa : గతంలో వచ్చిన క్లాసిక్ సినిమాల లో కృష్ణంరాజు నటించిన భక్త కన్నప్ప కూడా ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అప్పట్లో ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. దీంతో ఈ సినిమాని ప్రభాస్ తో రీమిక్స్ చేయాలని కృష్ణంరాజు ప్రయత్నించారు.ఇక ఈ సినిమాను” గోపికృష్ణ మూవీస్ బ్యానర్” పై నిర్మించాలని అనుకున్నారు కానీ స్క్రిప్ట్ వర్కౌట్ కాకపోవడంతో ఈ సినిమాకు బ్రేకులు పడ్డాయి. అయితే ఇప్పుడు మంచు విష్ణు ఈ సినిమాను రీమేక్ చేయడానికి ముందుకు వచ్చాడు. ఇప్పటికే ,ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగా మార్పులు చేసి “కన్నప్ప” సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ళేందుకు మంచు విష్ణు టీం ప్రయత్నిస్తోంది.
ఇక ఈ సినిమాకు మొదట తనికెళ్ల భరణి దర్శకత్వం వహిస్తారని ప్రచారం జరుగగా ఈ ప్రాజెక్టు నుండి ఆయన తప్పుకున్నారు. అనంతరం హిందీలో పలు రకాల సీరియల్స్ ను డైరెక్ట్ చేసిన ముఖేష్ కుమార్ గౌడ్ ను కన్నప్ప సినిమాకు దర్శకుడిగా నియమించారు. అయినప్పటికీ ఈ సినిమాపై అంచనాలు మాత్రం ఏర్పడలేదు. ఇక ఎప్పుడైతే ప్రభాస్ నయనతార వంటి స్టార్ సెలబ్రిటీలు ఈ సినిమాలో ఉన్నారని వార్త బయటకు వచ్చిందో అప్పటినుండి ఈ సినిమాపై క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.
ఇదిలా కొనసాగుతుండగా మోహన్ లాల్ కూడా ఈ ప్రాజెక్టులో భాగమవుతున్నట్లు అనౌన్స్ చేశారు. దీంతో ఒక్కసారిగా ఈ సినిమా అంచనాలు పెరిగాయి . ఇక ఇప్పుడు కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కూడా ఈ ప్రాజెక్టులో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ వార్తలపై అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ ఇది కూడా నిజమే అని స్పష్టమవుతుంది. అయితే ఇటీవల రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమాలో మోహన్ లాల్ మరియు శివరాజ్ కుమార్ అతిధి పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. దీంతో ఆ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది . ఈ నేపథ్యంలో కన్నప్ప సినిమాలో వీరి పాత్రలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది. అదే జరిగితే కన్నప్ప సినిమా ఇండస్ట్రీ ని షేక్ చేయడం ఖాయం.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…