Balakrishna reject the Kalyan Ram's movie
Kalyan Ram : నందమూరి కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక పక్క సినిమాలో హీరోగా చేస్తూనే మరో ప్రక్క నిర్మాతగా సినిమాలను రూపొందిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో వశిష్ట అనే కొత్త దర్శకుడు తో ‘ బింబిసారా ‘ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాను రేపు శుక్రవారం విడుదల చేయనున్నారు. కళ్యాణ్ రామ్ హీరోగా కంటే తన హోమ్ బ్యానర్ లోని ఎక్కువ సినిమాలను నిర్మిస్తున్నారు. అలానే తమ్ముడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ‘ జై లవకుశ ‘ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించారు. ఆ సినిమా తర్వాత తారక్ రెండు చిత్రాలలోనూ ప్రొడ్యూసర్ గా వ్యవహరించనున్నారు.
అయితే ఎన్టీఆర్ ఆర్ట్స్ లో తన బాబాయ్ నందమూరి బాలకృష్ణతో కళ్యాణ్ రామ్ సినిమా చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ క్రమంలో ‘ బింబిసార ‘ సినిమా ప్రమోషన్స్ లో నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో కళ్యాణ్ రామ్ ఈ విషయంపై రెస్పాన్స్ అయ్యారు. ఎప్పటినుంచో బాలయ్యతో మూవీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. బాలయ్య బాబాయ్ కి ఒకసారి కథ చెప్పించా, అది నచ్చలేదు. మాకు నచ్చిన కథ బాబాయ్ కి నచ్చాలని లేదు కదా. భవిష్యత్తులో మరో మంచి కథ వస్తే తప్పకుండా బాబాయ్ తో చేస్తా ఆయనకు కథ నచ్చే వరకు ప్రయత్నిస్తా, నా బ్యానర్లో ఆయనతో సినిమా తప్పకుండా జరుగుతుంది అని కళ్యాణ్ రామ్ వెల్లడించారు.
ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తో కలిసి నటిస్తారా, మల్టీ స్టారర్ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని అడగ్గా.. ఏముందండి కథలు వస్తే చేయడానికి రెడీనే అని రొటీన్ గా నేను చెప్పలేను, ఇద్దరు స్టార్స్ కలుస్తున్నారంటే చాలు కథేమిటి అనే అంశంతో సంబంధమే లేకుండా ప్రేక్షకుల అంచనాలు పెంచుకుంటారు. అందుకు తగ్గట్టుగా ఉండాలి లేదంటే సమస్యలు వస్తాయని చెప్పారు. ఇద్దరు స్టార్ హీరోలను కలిపి ‘ ఆర్ఆర్ఆర్ ‘ చేయడానికి మనకి ఇంత సమయం పట్టింది. ఆ బాధ్యతని రాజమౌళి లాంటి దర్శకుడు పూనుకుంటేనే అయింది. మల్టీ స్టారర్ సినిమాలు కుదరటం మాట్లాడుకున్నంత ఈజీ కాదు. ‘ మనం ‘తరహా చిత్రాలు చేయాలన్నా సరే చాలా అంశాలు కుదరాలి అని చెప్పుకొచ్చారు.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…