janvi kapoor given clarity entry tollywood with Jr NTR
Janvi Kapoor : అలనాటి అతిలోకసుందరి శ్రీదేవి తన అందచందాలతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆమెకు దీటుగా తన కూతురు జాన్వికపూర్ కూడా బాలీవుడ్ లో మంచి పాపులారిటీ సొంతం చేసుకుంటుంది. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ లో కొన్ని ప్రాజెక్టులను లైన్ లో పెడుతుంది. అలాగే తెలుగులో కూడా సినిమా చేయనుందని కొంతకాలం నుంచి వార్తలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో జోడిగా నటించనుందని ఈ మధ్య వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాను చేయబోతున్నారు.
ఆ సినిమాలో హీరోయిన్ గా జాన్వి కపూర్ లో తీసుకుంటున్నట్లు ఒక పుకార్లు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం ఈ విషయంపై జాన్వి కపూర్ స్పందించింది. ఎన్టీఆర్ తో జోడి నిజమైతే ఎంతో బాగుండు అంటూ మురిసిపోతుంది. వాస్తవానికి నాకు తెలుగు సినిమా చేయాలని ఉంది. అలాగే తెలుగు సినిమా లేదంటే ఏదైనా సౌత్ సినిమా చేయాలని చాలా ఆసక్తిగా ఉన్నాను. అందులోను ఎన్టీఆర్ తో పని చేసే అవకాశం వస్తే అంతకుమించిన ఆనందం మరొకటి ఉండదు.
ఎన్టీఆర్ ఒక లెజెండ్. ఆయనతో సినిమా చేయాలని నాకు ఉంది. కానీ నా బ్యాడ్ లక్ మీరు అనుకున్నట్లుగా నేను ఆయన సినిమాలో చేయడం లేదు. నాకు ఆ సినిమాలో అవకాశం రాలేదు. కానీ ఎన్టీఆర్ తో కలిసి పని చేయడానికి నేను ఎంతగానో ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చింది ఈ అమ్మడు. జాన్వి కపూర్ లేటెస్ట్ మూవీ గుడ్ లక్ జెర్రీ. ప్రస్తుతం హాట్ స్టార్ లో ప్రసారమవుతుంది. ఈ మూవీని డైరెక్టర్ సిద్ధార్థ సేన్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుంది.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…