Guppedantha Manasu 30 July Today Episode 516
Guppedantha Manasu 30 July Today Episode 516 : గుప్పెడంత మనసు సీరియల్ 30-july-2022 ఎపిసోడ్ 516 ముందుగా మీ కోసం……రిషి దగ్గరికి వసుధార వచ్చి సార్ మీతో మాట్లాడాలి అని చెప్పి కూర్చుంటుంది. తర్వాత వసుధార గిఫ్ట్ తీసి రిషికి ఇస్తుంది. రిషి దాన్ని ఓపెన్ చేస్తాడు.రిషి ఆర్టిస్టుని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు ఆ గిఫ్ట్ ఒకప్పుడు వసుదరకి ఇచ్చి ప్రపోజ్ చేసిన గిఫ్ట్ గతాన్ని మొత్తం గుర్తు తెచ్చుకుంటాడో రిషి. ఇది నా ప్రేమను వ్యక్తపరచడానికి వసుధార ఇచ్చిన గిఫ్ట్ అది దీన్ని ముక్కలుగా చేసింది కదా అని ఆలోచిస్తూ వుంటాడు రిషి.
ముక్కలు చేసిన నా మనసుని అతికించి మళ్లీ నాకే ఎందుకిస్తుంది ఏం చెప్పాలనుకుంటుందో అని ఆలోచిస్తూ ఉంటాడు రిషి ఈ గిఫ్ట్ ని చూస్తుంటే నాకు గాబరాగా ఉంది ఎందుకు వసుదార నన్ను కెన్సస్ చేస్తున్నావని ఆలోచిస్తూ ఉంటాడు రిషి.రిషి గిఫ్ట్ని తిప్పి చూడబోతుంటే ఇంతలో సడన్ గా సాక్షి తన స్పీచ్ మొదలు పెడుతుంది.ఆ గిఫ్ట్ పైనా ఐలవ్యూ సార్ అని రాసున్న దాన్ని రిషి చూడకుండా ఉంటాడు .ఇంతలో సాక్షి తన స్పీచ్ లో ఈ కాలేజీకి నాకు ఏ సంబంధం లేదు కానీ కాలేజ్ నాది అని చెబుతూ ఉంటుంది దాంతో అందరూ ఆశ్చర్యపోయి సాక్షి వైపు చూస్తూ ఉంటారు.
రిషి గిఫ్ట్ పైనా ఐలవ్యూ అని రాసినది చూడబోతుంటే ఇంతలో సాక్షి రిషికి కాబోయే భార్యను నేనయినప్పుడు కాలేజీ నాదే కదా అని చెప్పగానే అందరూ షాక్ తో తనవైపే చూస్తూ ఉంటారు.సాక్షి చెప్పిన మాటలకి రిషి ఒక్కసారిగా ఉలిక్కిపడి తన చేతిలో ఉన్న గిఫ్ట్ని కిందికి వదిలేశాడు ఆ గిఫ్ట్నే ని వసుదార పట్టుకుంటూ ఉంటుంది. అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి లేచి నిలబడి తనవైపే చూస్తూ ఉంటారు. రిషికి నాకు ఎంగేజ్మెంట్ అయింది కాదని రిషి సార్ని చెప్పమనండి అని అందరూ ముందు అడుగుతుంది సాక్షి .
సాక్షి ఏం చేస్తున్నావు నువ్వు అనే రుషి కోపంగా సాక్షి దగ్గరికి వస్తాడు మీ ఫోన్కి చాలా ఫోటోలు పంపించాను ఇప్పుడైనా చూడు రిషి అని అనగానే రిషి చూస్తాడు తీరా చూస్తే ఆ ఫొటోస్ లో వసుధార, రిషి కలిసి ఉన్న ఫోటోలు అన్నీ ఉంటావే ఇవన్నీ మీడియా వాళ్లకి చూపిస్తాను. నీకిప్పుడు ఏం కాదు నీ కిష్టమైన ప్రియమైన వాళ్ళకి మాత్రమే డ్యామేజ్ అవుతుంది ఫొటోస్ చూస్తే అని సాక్షి బ్లాక్మెన్ చేస్తుంది.మీరు స్టోరూంలోకి ఎందుకు వెళ్లారో ఏం చేస్తారో నాకు తెలియదు కానీ ఈ ఫొటోలకు నేను అందమైన ప్రేమకథను జోడించి మీడియా వాళ్లకి చెప్తాను అని సాక్షి బ్లాక్ మెయిల్ చేస్తోంది రిషిని.
మీడియా మిత్రులందరికీ చెప్తున్నాను ఎంగేజ్మెంట్ జరిగిన మా ఇద్దరికి త్వరలో పెళ్లి జరగబోతోంది అందరూ తప్పకుండా రావాలి ఆశీర్వదించాలి అని చెప్తూనే ఉంటుంది సాక్షి .రిషి ఏం మాట్లాడకుండా సైలెంటుగా ఉండిపోతారు.అలా రిషిని ఏం మాట్లాడనీయకుండా ఇరకాటంలో పడేస్తోంది సాక్షి .అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు.రిషి వసుదార వైపు చూస్తూ ఉంటాడు.అక్కడున్న వారందరూ రషికి కంగ్రాట్స్ చెప్తూ ఉంటారు వసుధార చాలా బాధ పడుతూ అక్కడి నుండి వెళ్లిపోతుంది తన వెళ్లిపోవడం రషి కూడా చూస్తాడు.
సాక్షి చేసిన పనికి రిషికి చాలా కోపం వస్తుంది కానీ ఏం మాట్లాడలేక పోతాడు.అసలేం జరిగింది అనే మహేంద్ర, జగతి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు.మనకే ఇలా ఉంటే రిషి పరిస్థితి ఎలావుందో ఏంటో అనే మహేంద్ర అనుకుంటూ ఉంటాడు.ఎందుకు రిషి ఏం మాట్లాడలేదు సైలెంటుగా ఉన్నాడు ఎందుకు అలా ఉన్నాడు అని అంటూ ఉంటాడు. మహీంద్రా అది గొప్ప వాళ్ళ లక్షణం మహేంద్ర అని జగతి చెప్తుంది .కోపం ఒక పదునైన ఆయుధం మహీంద్రా దాన్ని సరైన సమయంలో వాడాలి రిషి చాలా తెలివైనవాడు కాలేజీలో ఎలాంటి పొరపాట్లు జరగకూడదన్న అలా సైలెంట్ గా ఉన్నాడని జగతి చెప్తోంది.
రిషి చాలా గ్రేట్ మహీంద్రా కాలేజీ పరువు ప్రతిష్టలు తన పర్సనల్ మ్యాటర్స్ కంటే గొప్పది అని రిషి భావించాడు. అందుకే సైలెంట్ గా ఉన్నాడని జగతి చెప్తోంది.ఇంతలో గౌతమ్ వచ్చి అందరూ వెళ్ళిపోయారు పదండి అంకుల్ అని అంటే దేవయానికూడా వెనుకనుంచి వచ్చి మహీంద్ర మీరు వెళ్లండి జగతి నువ్వుండు నీతో మాట్లాడాలని చెప్పి ఆపుతుంది దేవయాని.చూశావా జగతి ఇది నేనంటే ఏమనుకుంటున్నావని అని అంటోంది.నాకు అభినందనలు చెప్పవా సాక్షి రిషి పెళ్లికి నువు తప్పకుండా ఉండాలి అనే దేవయాని అనగానే, జరగని పెళ్ళికి బాజాల ఎందుకు అని అంటోంది జగతి.
అక్కయ్య నా కొడుకు పెళ్లి నా చేతుల మీదుగా జరుగుతుంది. కానీ మీరనుకున్నట్టు సాక్షితో జరగదు నేననుకున్న అమ్మాయితోనే జరుగుతుంది అని జగతి గట్టిగా చెప్తోంది. నేను పెంచాను అని దేవయాని అనగానే గంజాయి మొక్క పక్కన తులసి మొక్క పెరిగిన తులసి మొక్క తన సహజత్వాన్ని కోల్పోదు అక్కయ్యా అని జగతి మంచిగా సమాధానం చెబుతుంది.ఇక ఆ తర్వాత రిషి తన కారు దగ్గరికి వెళ్లి సాక్షి మాట్లాడిన మాటలని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు.ఇంతలో రిషి దగ్గరికి ఒకరు వచ్చి సాక్షి మేడమ్ మీ పెళ్లి ఎప్పుడు అని అడుగుతారు.
తర్వాత ఇన్ని రోజులు మీరు సాక్షి మేడం ప్రేమించుకుంటూ వున్నారా సార్ అని అడగ్గానే, మీరు వచ్చింది చదువులు పండగ గురించి తెలుసుకోవడానికి వచ్చారు నా పర్సనల్ ఎందుకు వదిలేయండి అని చెప్పి వెళ్లిపోతాడు తర్వాత రిషి ఇంతకు వసుధర ఎక్కడుంది కనిపించట్లేదు అని ఆలోచిస్తూ ఉంటాడు రిషి.వసుధార రిషి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఒకప్పుడు మీ మనసు ముక్కలైనట్టు ఇప్పుడు కూడా నా మనసు అలాగే ముక్కలైంది సార్. పెరిగితేనే అతికించాను మన బంధం ఇలాగే ఉండాలని నేను పూర్తిగా ప్రయత్నిస్తాను అని అనుకుంటూ ఆలోచిస్తూ రెస్టారెంటు ఒంటరిగా కూర్చొని ఉంటుంది వసుదార. ఇంతలో అక్కడికి సాక్షి వచ్చి హలో వసుధారా అని చెప్తోంది.
వెంటనే వసుధార తన చేతిలో ఉన్న గిఫ్ట్ని బ్యాగ్లో దాచిపెడుతోంది.సాక్షి వచ్చే నాకు కంగ్రాట్స్ చెప్పావా వసుదార అని అంటోంది. ఈ రోజు నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను ఈరోజు ఉన్నంత సంతోషంగా నేను ఎప్పుడూ లేను అని చెప్తోంది సాక్షి.నేనెందుకు సంతోషంగా ఉన్నాను అడగవా అని అంటోంది సాక్షి .నేను ఎందుకు సంతోషంగా ఉన్నానొ నికు ఆల్రెడీ తెలుసుకదా డీబీఎస్ సిటీ కాలేజీ ఎండీ రిషి నాకు కాబోయే భర్త అని చెప్తే ఎంత సంతోషంగా ఉందో కదా ఆ ఫీలింగ్ని నికు అర్థం కాదులే అని సాక్షి వెటకారంగా అంటోంది.ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ పూర్తవుతుంది
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…